బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో స్మగ్లర్స్ ఇంకా పోలీసుల మద్యలో టాస్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ ఛాలెంజర్స్ పోలీసులుగా ఉన్న టీమ్ లో స్మగ్లర్స్ ని ఆపలేకపోయారు. 30 బొమ్మలని దిగ్విజంగా స్మగ్లర్స్ డ్రాప్ బాస్క్ లో వేశారు. ఆ తర్వాత ఛాలెంజర్స్ స్మగ్లర్స్ గా మారి 33 బొమ్మలని వేసి వారియర్స్ పై విజయం సాధించారు. బిగ్ బాస్ ఎనౌన్స్ మెంట్ వచ్చేటపుడు ఛాలెంజర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడే బిగ్ బాస్ ఛాలెంజర్స్ నుంచీ ఒక నలుగురిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంచుకోమని అడిగాడు.
ఛాలెంజర్స్ చాలాసేపు డిస్కస్ చేసుకుని నలుగురు పేర్లు చెప్పారు. అయితే ఈ డిస్కషన్స్ లో మిత్రాశర్మా పేరు చెప్పలేదని అందులో పార్టిసిపేట్ చేయలేదు. డెసీషన్ వాళ్లకే వదిలేసింది. తర్వాత వాష్ రూమ్ లో సరయుతో తన మనసులో మాటల్ని చెప్పుకుని బాధపడింది. కనీసం నా పేరు ఒక్కసారిగా కూడా చెప్పలేదని, వాళ్ల లిస్ట్ లో నేను లాస్ట్ నెంబర్ ని అని బాధపడింది. ఇక ఛాలెంజర్స్ శ్రీరాపక, శివ, చైతూ, అనిల్ ని ఎంపిక చేసుకున్నారు.
వారియర్స్ ఎంత మొత్తుకున్నా కూడా బిగ్ బాస్ వాళ్ల రిక్వస్ట్ ని కన్సిడర్ చేయలేదు. టాస్క్ లో ఛాలెంజర్స్ గెలిచనట్లుగానే ఎనౌన్స్ చేశాడు. నిజానికి గేమ్ పాజ్ లో ఉందని, వాళ్లు బొమ్మలని నైట్ స్మగ్ల్ చేశారని చెప్పారు. కానీ బిగ్ బాస్ పట్టించుకోలేదు. కానీ, వారియర్స్ టీమ్ ని కూడా అభినందిస్తూ ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులని వారి ప్రదర్శన ఆధారంగా ఎంచుకోమని చెప్పాడు. దీంతో వారియర్స్ టీమ్ కూడా డిస్కషన్స్ లోకి వెళ్లింది. వారియర్స్ టీమ్ నుంచీ రెండో పర్సన్ ని ఎంచుకోవడానికి చాలా టైమ్ పట్టింది.
మరోవైపు ఛాలెంజర్స్ కెప్టెన్సీ టాస్క్ లో ఏం చేయాలి అనేది ప్లాన్ చేస్కున్నారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత హమీదా పేరుని అఖిల్ సజస్ట్ చేశారు. ముగ్గురు ఓట్లు వేశారు. తర్వాత నటరాజ్ మాస్టర్ చిన్నపాటి ఆర్గ్యూమెంట్ లో బయటకి వచ్చేశారు. అలాగే తేజు కూడా నేను ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి నెక్ట్స్ వీక్ చేస్తా అంటూ చెప్పింది. చాలాసేపు సీనియర్స్ రెండో పేరు ఎంచుకోవడానికి కష్టపడ్డారు. చాలాసేపు తర్జన భర్జన పడిన తర్వాత అరియానా పేరు కన్ఫార్మ్ చేశారు.
కెప్టెన్సీ టాస్క్ లో ఛాలెంజర్స్ నుంచీ నలుగురు, వారియర్స్ నుంచీ ఇద్దరూ కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ చేయబోతున్నారు. వీరిలో ఛాలెంజర్స్ నుంచీ శ్రీరాపక, చైతూ, శివ, అనిల్ వారియర్స్ నుంచీ హమీదా, అరియానా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి వీరిలో రెండోవారం కెప్టెన్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరం.