సినిమా విజయాన్ని, ఆ సినిమాతో సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు పంచాలని రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ అనుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఓ గూగుల్ డాక్ కూడా క్రియేట్ చేశాడు. అయితే అదెంత పాపులర్ అయింది, ఎవరు డేటా ఇచ్చారు అనేది పక్కనపెడితే.. ఆ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ అభిషేక్ పిక్చర్స్ చేసిన ఓ ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. అదే ‘మేం రూ. 8 కోట్లు నష్టపోయాం.. మా సంగతి కూడా కాస్త చూడండి’ అని.
విజయ్‌కి, అభిషేక్ పిక్చర్స్‌కు మధ్య ఏం జరిగింది, ఇన్నాళ్లు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడెందుకు ఇలాంటి ట్వీట్ పెట్టారు అని కొందరు ఆలోచిస్తే.. ఇంకొందరు అయితే గతంలో విజయ్ సినిమాల వల్ల డబ్బులు బాగానే సంపాదించారుగా.. అప్పుడు విజయ్‌కి ఏమైనా ఇచ్చారా అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో అసలు ఏం జరిగింది, అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది అంటూ ఓ మీడియా సంస్థ అభిషేక్ పిక్చర్స్ టీమ్‌తో మాట్లాడిందట. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి అంటున్నారు.
‘ఖుషీ’ మూమెంట్ అంటూ విజయ్ ఇలా విజయ్ అనౌన్స్ చేయగానే… అభిషేక్ నామా టీమ్ అలా ట్వీట్ చేయడం, ఆ తర్వాత ఓ మీడియాలో ఇంటర్వ్యూ రావడం జరిగిపోయాయి. ఆ ఇంటర్వ్యూలో అభిషేక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆ తర్వాత క్లారిటీ కోసం ప్రయత్నిస్తే ఆయన పెద్దగా అందుబాటులో లేరు అంటున్నారు. ఏదో మాట్లాడా, ఏదో రాసారు వదిలేయండి అని అన్నారని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది.
ఇక్కడ విషయం అంతా విజయ్‌తో (Vijay Devarakonda) కాదని, గతంలో ఓ సందర్భంలో విజయ్ సన్నిహితులతో మాట్లాడినప్పుడు వచ్చిన మాటలు, వ్యాఖ్యలు కూడా ఓ కారణం అని చెబుతున్నారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదలై ఇబ్బందికర ఫలితం అందుకున్నాక… ఆ విషయాన్ని విజయ్, అతని సన్నిహితులు పట్టించుకోలేదని కూడా అభిషేక్ కామెంట్స్ చేసినట్లు ఓ కథనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటో అభిషేక్ చెప్పాలి, లేదంటే ట్వీట్ చేయాలి.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!