Acharya Movie: చిరు ఫ్యాన్స్‌కి ‘ఆచార్య’ గుడ్‌ న్యూస్‌ రాలేదుగా!

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిన్న (ఆగస్టు 22న) ఆయన అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు వచ్చాయి. చిరంజీవి రాబోయే సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ రిలీజ్‌ చేశారు. ‘లూసిఫర్‌’ రీమేక్‌ టైటిల్‌, ‘వేదాళం’సినిమా పోస్టర్‌, టైటిల్‌, బాబీ సినిమా టీజర్‌ లుక్‌ వచ్చాయి. దీంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. ఉదయం నుండి వరుసగా వచ్చిన అప్‌డేట్స్‌తో సోషల్‌ మీడియా దద్దరిల్లిపోయింది. అయితే చిన్న వెలితి ఉండిపోయింది. అదే ‘ఆచార్య’.

చిరంజీవి రాబోయే సినిమాలకు సంబంధించి ఆసక్తికర సమాచారం చూసి మురిసిపోయిన అభిమానులు ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ఉసూరుమన్నారు. సినిమా అంతా సిద్ధమై విడుదలకు రెడీగా ఉందని ఎప్పుడో తెలుసు. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారేమో అని అందరూ అనుకున్నారు. కొత్త వీడియో లేదా పోస్టర్‌ ఏదో ఒకటి వస్తుంది అనుకున్నారు. కానీ అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. ‘ఆచార్య’ నుండి ఓ పోస్టర్‌ అయితే బయటికొచ్చింది కానీ… అది కొత్తదేం కాదు.

చాలా రోజుల క్రితమే లీకైపోయిన ఫొటో అది. దీంతో అభిమానులకు పెద్ద కొత్తదనం ఏమీ కనిపించలేదు. కనీసం ఆ పోస్టర్‌ మీద డేట్‌ వేసి రిలీజ్‌ చేసినా ఆనందపడేవారేమో. కానీ ‘ఆచార్య’ టీమ్‌ ఆ దిశగా ఆలోచించలేదు. లీక్‌ అయిన పోస్టర్‌నే మళ్లీ రిలీజ్‌ చేసింది. దీంతో అభిమానులు నిరాశచెందారు. లీక్‌ అయ్యిందని తెలిసినా… అదే రిలీజ్‌ చేసి చేతులు దులుపుకోవడం ఎందుకో?

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus