Ajith: ఆ రోజు అజిత్‌ దెబ్బల విషయం చెప్పలేదు ఎందుకంటే?

‘వలిమై’ సినిమాలో అజిత్‌ ఓ రేసింగ్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తుంటే… బైక్‌ అదుపు తప్పి కింద పడిపోయారు. కొన్ని రోజుల క్రితం దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం రిలీజ్‌ చేసింది. అందులో బండి మీద నుండి కింద పడిపోయినా అజిత్‌… కూల్‌గా లేచి బండి పక్కకు తీసుకొని.. కాసేపటికి షూటింగ్‌ తిరిగి స్టార్ట్‌ చేశారు. అయితే ఆ రోజు ఏం జరిగిందో హీరో.. ఆ సినిమాలో విలన్‌ అయిన కార్తికేయ చెప్పాడు. ఆ విషయం వింటే అజిత్‌ను ఎందుకు సూపర్‌స్టార్ అంటారో, సినిమా నిర్మాత కోసం ఎంతగా ఆలోచిస్తారో తెలుస్తుంది.

Click Here To Watch

‘వలిమై’ షూటింగ్‌లో అజిత్‌ నుండి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెప్పాడు కార్తిఏయ. వృత్తిపట్ల ఆయన చూపించే నిబద్ధత గురించి చెప్పడానికి మాటలు చాలవు అన్న కార్తికేయ, రేసింగ్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తుండగా అజిత్‌కు జరిగిన ప్రమాదం గురించి వివరంగా చెప్పారు. బైక్‌ రైడ్‌ చేస్తూ అజిత్‌, అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయారు. అప్పుడు ఆయనకు పెద్ద దెబ్బలే తగిలాయి. కానీ ఆయన ఆ విషయాన్ని చెప్పలేదు. మామూలుగా బైక్‌ లేపి.. పక్కకు తీసుకొని వచ్చేశారు అని చెప్పాడు కార్తికేయ.

ఆ షూటింగ్‌ సమయంలో కార్తికేయ అక్కడే ఉన్నారట. దెబ్బలు తగిలిన విషయం తర్వాత తెలిసి ‘ఎందుకు సర్‌ అంత రిస్క్‌. రెండ్రోజులు రెస్ట్‌ తీసుకోవచ్చు కదా’ అని అడిగాడట కార్తికేయ. దానికి అజిత్‌ ‘‘ఇప్పుడు నీ డేట్స్‌ ఉన్నాయి. మళ్లీ తర్వాత షూటింగ్‌ అంటే నీకు కష్టమవుతుంది. ఫైట్స్‌ మాస్టర్స్‌ కాల్‌షీట్స్‌, లొకేషన్‌ ఖర్చులు, మళ్లీ ఇక్కడికి రావడం… ఇలాంటివన్నీ ఎందుకు చెప్పు. వీటి వల్ల అందరికీ ఇబ్బందే. నేనే ఒకరోజు ఓపిక పడితే సరిపోతుంది కదా’’ అని అజిత్‌ అన్నారట. అందుకే అజిత్‌ను అందరూ సూపర్‌ స్టార్‌ అంటారు.

కార్తికేయ ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో రేసర్‌గా కనిపించాడు. అయితే అతనికి రేసింగ్‌ రాదు. ‘వలిమై’ పాత్ర ఆఫర్‌ చేసినప్పుడు రేసింగ్‌ ఎపిసోడ్ల గురించి భయపడ్డాడట. అదే విషయందో డైరక్టర్‌ వినోద్‌కి చెబితే మేం చూసుకుంటాం అన్నారట. అన్నట్లే షూటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారట. కార్తికేయ కోసం అజిత్‌… కొన్నిసార్లు బైక్‌ రేసింగ్‌ నెమ్మదిగా చేస్తూ బ్యాలెన్స్‌ చేశారట. సినిమాలో 80 % యాక్షన్‌ ఎపిసోడ్స్‌ డూప్‌ లేకుండా చేశాడట కార్తికేయ. బైక్‌లు గాల్లోకి ఎగిరేసే రిస్కీ షాట్లయితే చేయలేదట.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus