బిగ్ బాస్4: సోహైల్ అఖిల్ ని నామినేట్ చేస్తాడా..?

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్ అనేది సర్వసాధారణం. ఎంతటి ఘనుడు అయినా సరే కన్నీళ్లు పెట్టాల్సిందే. అలా ఉంటుంది ఈ షో. ఫస్ట్ నుంచి కూడా అఖిల్ బిగ్ బాస్ హౌస్ లో తనదైన యాటిట్యూడ్ ని చూపిస్తునే ఉన్నాడు. టాస్క్ వచ్చినపుడు, లేదా గేమ్ లో ఉన్నప్పుడు చాలా ఫోకస్ గా ఉంటాడు అఖిల్. అదే అతని బలం. అయితే, పెయిర్స్ కి మెడల్ ట్యాగ్స్ ఇచ్చినపుడు చాలాసేపు ఆలోచించి, మెహబూబ్ అండ్ సోహైల్ జంటకి అబద్ధాల కోరు అనే ట్యాగ్ ఇచ్చాడు. ఇక్కడ మోనాల్ అండ్ అఖిల్ ఇద్దరూ కూడా డిసైడ్ చేసి మరీ ఇచ్చారు. మెహబూబ్ గురించి మోనాల్ చెప్తే, సోహైల్ గురించి అఖిల్ చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న సోహైల్ తనకి అబద్ధాల కోరు అనే ట్యాగ్ నీకు ఎలా ఇవ్వాలి అనిపించింది ? అని అఖిల్ ని నిలదీశాడు.

ఇక్కడే ఇద్దరికీ కాస్త ఆర్గ్యూ జరిగింది. అఖిల్ కూల్ గానే లైటర్ వే లో ఆన్సర్ చేస్తుంటే సోహైల్ మాత్రం తనదైన స్టైల్లో రెచ్చిపోయి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎంత సముదాయించాలని చూసినా ఊరుకోలేదు. అక్కడ అఖిల్ చాలా ఓపిగ్గా సోహైల్ చెప్పిందంతా విన్నాడు. నాకు అనిపించింది నేను చేశాను. గేమ్ ఆడలేదు.., గేమ్ ఆడాలని ఉంటే వేరేవాళ్లకి ఇచ్చేవాడ్ని అని చెప్తున్నా సోహైల్ వినిపించుకోలేదు. తనకి నిజంగా అబద్ధాలు ఎప్పుడు చెప్పానో చెప్పమని నిలదీశాడు.

దీంతో అఖిల్ దగ్గర ఆన్సర్ లేదు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడా చెప్తే దాన్ని అబద్ధం అనరు అంటూ సోహైల్ వాదించేసరికి అఖిల్ బరస్ట్ అయ్యాడు. దీంతో బాధపడ్డాడు.. కన్నీళ్లు కార్చాడు. ఇక్కడే వెంటనే రియలైజ్ అయిన సోహైల్ అఖిల్ ని ఓదార్చాడు. ఇక ఈ టాపిక్ తీయనులే ఫీల్ అవ్వకు అని చెప్పాడు. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది. అయితే, ఈ రీజన్ తో ఇప్పుడు సోహైల్ అఖిల్ ని నామినేట్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరం. ఎందుకంటే, లాస్ట్ వీక్ సోహైల్ కి ఎవరిని నామినేట్ చేయాలో అర్ధం కాలేదు. సెకండ్ ఆప్షన్ తనకి లేదు. అందుకే అమ్మరాజశేఖర్ చేయి ఎత్తాడని నామినేట్ చేసేశాడు. ఇప్పుడు రీజన్ దొరికింది కాబట్టి అఖిల్ ని నామినేట్ చేస్తే తన గేమ్ లో జెన్యూనిటీ అనేది బయటకి వస్తుంది. లేదా ఫ్రెండ్షిప్ పైన లైట్ తీస్కుంటే ఈసారి నామినేట్ చేసేవాళ్ల గురించి బలమైన కారణాలు సోహైల్ చెప్పాల్సివస్తుంది. మరి సోహైల్ నెక్ట్స్ వీక్ ఏం చేస్తాడు అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus