బిగ్ బాస్ 4: మోనాల్ గెలిచింది..! అఖిల్ ఓడిపోయాడు..!

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా మలుపులు తీస్కుంది. ఎవరైతే కెప్టెన్సీ పోటీదారులు ఉన్నారో వారిని పార్టిసిపెంట్స్ భుజాలపైన మోయాలి. ఎవరైతే ఎక్కువసేపు ఎండ్ బజర్ మోగేంత వరకూ ఉంటారో వాళ్లు గెలిచినట్లుగా లెక్క. ఇక్కడే అభిజిత్ ని – హారికని ఎవరు ఎత్తుకుని ఉంటారు అని డిస్కషన్ నడించింది. అభిజిత్ కోసం అవినాష్ వస్తే, హారిక కోసం మోనాల్ వచ్చింది. అందుకే అఖిల్ కి కోపం కూడా వచ్చింది.

7-8 సార్లు కెప్టెన్సీ టాస్క్ కి పోటీ చేసినా గెలవని హారిక ఎట్టకేలకి మోనాల్ వల్ల కెప్టెన్ అయ్యింది. చాలాసేపు ధైర్యంగా, మొండిగా మోనాల్ హారికని ఎత్తుకుని ఎల్లో రింగ్ లో అలాగే నిలబడి ఉంది. అటు , ఇటు కదల్లేదు బెసకలేదు. దీంతో హారిక కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించింది.

దీని తర్వాత అఖిల్ సోహైల్ తో మాట్లాడుతూ ఉదయం కెప్టెన్సీ టాస్క్ రాకముందు మనం మాట్లాడుకున్నపుడు అవినాష్, మోనాల్, సోహైల్ నువ్వు సపోర్ట్ చేస్తానని అన్నావని గుర్తుచేశాడు. కానీ , మోనాల్ హారికని సపోర్ట్ చేసింది చూసావా అంటూ మాట్లాడాడు. అంతేకాదు, అక్కడ బెడ్ ని బలంగా కొడుతూ తన ప్రస్టేషన్ ని తీర్చుకున్నాడు. నిజానికి మోనాల్ చేసింది అక్కడ పెద్ద మిస్టేక్ అస్సలు కానేకాదు. తన గేమ్ తను ఆడింది. ఇదే విషయాన్ని కిచెన్ లో అభిజిత్ తో మాట్లాడుతూ పంచుకుంది. నేను ఫస్ట్ అఖిల్ ని అడిగాను.

తను నాపై నమ్మకం ఉంచలేదు, సోహైల్ ని నమ్మాడు. హారిక నన్ను అడిగింది, నన్ను నమ్మింది సో నేను హారికకి సపోర్ట్ చేసి గేమ్ ఆడాను. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్లు ఆడాలి కదా అంటూ తన వెర్షన్ ని చెప్పుకుంది. అంతేకాదు, లాస్ట్ వీక్ కూడా ఇలాగే కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నన్ను నమ్మలేదు అని చెప్పింది. ఇక అఖిల్ మోనాల్ చేసిన పనికి కాసేపు మాట్లాడటం మానేశాడు. ఎప్పటిలాగానే వీరిద్దరి అలక ఎప్పటికి తీరుతుందో చూడాలి. అదీ మేటర్.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus