Movies: రీరిలీజ్‌ అంటే భయం వేసేలా చేస్తున్నారు… ఎందుకిలా చేస్తున్నారో?

  • August 19, 2023 / 05:43 PM IST

రిలీజ్‌ వర్సెస్‌ రీరిలీజ్‌… ఇప్పుడు టాలీవుడ్‌ ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది. ఓవైపు రిలీజ్‌కు పెద్ద సినిమాలు, పేరున్న సినిమాలు, కొత్త సినిమాలు సిద్ధం అవుతుంటే… మరోవైపు పాత సినిమాలు రీరిలీజ్‌లకు వస్తున్నాయి. అందులోనూ అప్పట్లో హిట్‌ అయిన సినిమాలా లేకపోతే కల్ట్‌ క్లాసిక్‌ సినిమాలా అంటే కావనే చెప్పాలి. అప్పట్లో జనాలు ఆదరించని, చూడటానికి కూడా భయపడిన సినిమాలు రీరిలీజ్‌లు చేస్తున్నారు. దీంతో ఇలా చేస్తే కష్టమే.. చూసుకోండి మరి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మొన్నీమధ్యే అనుకున్నాం.. ‘రీరిలీజ్లకు టాలీవుడ్‌కి మించిన పెద్ద అవకాశం ఇంకెక్కడా లేదు’ అని. మీరు కూడా వినే ఉంటారు, వార్తలు చదివే ఉంటారు. సూర్య ‘సన్నాఫ్‌ కృష్ణన్‌’ సినిమాను ఇక్కడ రిలీజ్‌ చేస్తే భారీ ఎత్తున వసూళ్లు వచ్చాయి, రెస్పాన్స్‌ వచ్చిందని చదువుకున్నాం. అయితే ఈ క్రమంలో అన్ని సినిమాలు ఇలా వస్తే ఇబ్బంది అనే మాట చెప్పాల్సి వస్తోంది. తొలి రిలీజ్‌ అప్పుడు డిజాస్టర్‌గా మిగిలిన సినిమాలు ఇప్పుడు వచ్చి బాగున్నాయి అనిపంచుకున్నాయి. అయితే అవి ఆ హీరోకు కల్ట్‌ క్లాసిక్‌ అని చెప్పాలి.

ఉదాహరణకు రామ్‌చరణ్‌కి ‘ఆరెంజ్‌’ సినిమా (Movies) అప్పుడు విజయం అందివ్వకపోవచ్చు కానీ.. చాలా మంచి అయితే తీసుకొచ్చింది. అందుకే రీరిలీజ్‌ అంటే ఫ్యాన్స్‌ కూడా ఆనందపడ్డారు, రెస్పాన్స్‌ కూడా చూపించారు. అయితే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ‘గుడుంబా శంకర్‌’, బాలకృష్ణ ‘ఒక్క మగాడు’, ‘లయన్‌’ సినిమాలను తీసుకొస్తారు అని మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో డిజాస్టర్‌లన్నీ వరుస కట్టే ఛాన్స్‌ ఉంది.

ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ల ట్రెండ్‌ పూర్తిగా ఆపేస్తే బెటర్‌ అనే వాళ్లు కూడా ఉన్నారు. దీని వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఈ దిశగా ఆ సినిమాలను మళ్లీ ప్రేక్షకుల నెత్తిన రుద్దుదాం అనుకుంటున్న వాళ్లు ఆలోచిస్తే బెటర్‌ అని నెటిజన్ల అభిప్రాయం. మరి వాళ్లు వింటారా లేదా చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus