Chiranjeevi,Nagarjuna: దసరా ఫైట్‌కి లాంచ్‌ అక్కడే ఎందుకు ?

తెలుగు సినిమా ప్రచారం అంటే.. ఠక్కున గుర్తొచ్చే ఊరు పేరు హైదరాబాద్‌. తెలుగు రాష్ట్రాల కలసి ఉన్నప్పటి నుండి, ఇప్పటివరకు ఎక్కువగా వినిపించేది ఇదే. అయితే గత కొన్ని రోజులుగా మన సినిమా వాళ్లు ప్రచారం కోసం వేరే ఊళ్లకు కూడా వెళ్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు అని మొదలుపెట్టి.. ఇప్పుడు వరంగల్‌, కరీంనగర్‌ వైపు కూడా చూస్తున్నారు. ఒక్కోసారి కర్నూలు కూడా వీరి పరిశీలన లోకి వస్తోంది. అయితే ఇద్దరు అగ్రహీరోలు రెండు, మూడు రోజుల గ్యాప్‌లో ఒకే ప్రాంతంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు పెడుతున్నారు అంటే ఆసక్తికరమే కదా.

అంతేకాదు ఎందుకు పెడుతున్నారు అనేదీ ఆసక్తికరం. మేం చెబుతున్నది ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ఘోస్ట్‌’ సినిమాల కోసమే అని మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. నాగార్జున – ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో రూపొందిన ‘ఘోస్ట్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 25న కర్నూలులో ప్లాన్‌ చేశారు. ఈ మేరకు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత చిరంజీవి – మోహన్‌ రాజా ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ 28న అనంతపురంలో జరగనుందని టాక్‌.

దీనిపై అఫీషియల్‌ సమాచారం లేకపోయినా.. అక్కడ ఈవెంట్ పక్కా అని చెబుతున్నారు. దీంతో ఇద్దరు స్టార్‌ హీరోలు ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు అక్కడే ఎందుకు చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా అనంతపురం బ్యాక్‌డ్రాప్‌ ఉంటుందని టాక్‌. అందుకే అక్కడ చేస్తున్నారట. ఇక నాగార్జున ‘ఘోస్ట్‌’ సంగతి తెలియడం లేదు. అయితే ఈ కారణం కాకుండా.. మాస్‌లోకి సినిమాకు తీసుకెళ్లే ఉద్దేశంలోనే రాయలసీమకు వెళ్తున్నారని చెప్పొచ్చు.

చిరంజీవి, నాగార్జునకు అక్కడ మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అందుకోసమే అక్కడ దృష్టి సారించారట. సినిమా సక్సెస్‌ మీట్‌ను విశాఖపట్నం లేదా గుంటూరులో చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. ప్రీ రిలీజ్‌ ఇక్కడ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్‌లో ఎలాగూ మిగిలిన ప్రెస్‌ మీట్లు ఉండనే ఉంటాయి. అన్నట్లు ఇప్పుడు ఈవెంట్లు పెడుతున్న ప్రాంతాలు హైదరాబాద్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాబట్టి వెళ్లి రావడం కూడా సులభం అని అంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus