Jailer: వసూళ్ల విషయంలో ఈ డౌట్స్‌ ఎందుకు? నిర్మాతలు తప్పు చేస్తున్నారా?

సినిమా విడుదలకు ముందు ప్రచారం కంటే… సినిమా విడుదలయ్యాక చేసే ప్రచారం, చేయాల్సిన ప్రచారం చాలా ఉంటుంది అని చెప్పాలి. సినిమా బాగోలేకపోతే ఏం చేయలేం కానీ.. వన్స్‌ బాగుంది అంటే ఆ విషయం ఇంకా ఎక్కువమందికి చేరాలి. ఎందుకంటే సినిమా బాగుంది అనే మౌత్‌టాక్‌ ఇప్పుడు జనాలకు చేరడం కష్టమైపోయింది. కాబట్టి ఆ పనిని కూడా సినిమా బృందాలే చేస్తున్నాయి. అందులో వసూళ్ల పోస్టర్లు ఒకటి. సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని చెప్పి… ప్రచారం చేసుకొని వసూళ్లు సంపాదిస్తున్నారనేది ఇటీవల కొన్ని సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అయితే సినిమా బాగుంటేనే చూస్తారు అనుకోండి.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా అందులోనూ పెద్ద సినిమా ప్రచారంలో తప్పులు జరిగితే ఇబ్బందే అని చెప్పాలి. ఇప్పుడు ఇంచుమించు ఇలాంటిదే జరిగి అనుమానాలకు తావిచ్చింది (Jailer) ‘జైలర్‌’ టీమ్‌. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో విజయవంతమైంది. వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం అయితే సౌత్ ఇండియాలో ఈ సినిమా సుమారు రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ సంపాదంచింది. అందుకుతగ్గట్టే ప్రచారం కూడా చేశారు.

కానీ తాజాగా సినిమా నిర్మాతలు రూ.375 కోట్లు అని ప్రకటించారు. పోనీలే రూ.36 కోట్లే కదా అనుకుంటే… ఆ లెక్క కూడా పక్కా కాదు అని అర్థం వచ్చేలా దిగువన చిన్న అక్షరాల్లో సుమారు అని అర్థం వచ్చేలా రాశారు. దీంతో క్లారిటీ ఇవ్వకుండా ఇలా రాయడమేంటి అని అంటున్నారు. గత సినిమాల రికార్డులు బద్దలుకొడుతున్నప్పుడు బలంగా రాయకుండా డౌట్‌ఫుల్‌ ఏంటి అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఉన్నది ఉన్నట్లు చెప్పారు తప్పేముంది. మొత్తం వివరాలు రాకపోయుంటాయి అని సపోర్టు చేస్తున్నారు.

అయితే, జరిగిందేదో జరిగింది.. ఇకపై అయినా ఇలాంటి డౌట్‌ఫుల్‌ పోస్టర్లు వద్దు అని అంటున్నారు. కోలీవుడ్‌లో పెద్ద సినిమాల రికార్డులు అన్నీ ఈ సినిమా బద్దలు కొట్టింది, కొడుతుంది అని మాత్రం ఫ్యాన్స్‌ అంటున్నారు. సినిమా వసూళ్లు చూస్తే అలానే అనిపిస్తోంది కూడా.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus