Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి పాన్ ఇండియా భయం.. కారణం అదేనా..?

  • June 28, 2024 / 01:07 PM IST

గత 3,4 ఏళ్లుగా పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. ఫైనల్ గా అవి అన్ని భాషల్లో రిలీజ్ అయినా.. అవ్వకపోయినా, ‘పాన్ ఇండియా’ అనే పదం వాడే మొదటి నుండి ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన సుధీర్ బాబు (Sudheer Babu)  ‘హరోం హర’ (Harom Hara) కూడా పాన్ ఇండియా సినిమాగా మొదలైనదే. ఇక పెద్ద దర్శకుల విషయానికి వస్తే.. రాజమౌళి (Rajamouli) , సుకుమార్ (Sukumar).. ఆల్రెడీ పాన్ ఇండియా డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు.

కొరటాల శివ (Koratala Siva) కూడా ‘దేవర’ (Devara)  తో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా పాన్ ఇండియా సినిమా చేసేశాడు. చందూ మొండేటి (Chandoo Mondeti) సైతం ‘కార్తికేయ 2 ‘ (Karthikeya 2) తో హిందీలో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీయడం లేదు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా తీయాలంటే.. పురాణాల్లో నుండి ఏదో ఒక కాన్సెప్ట్ ను తీసుకుని.. దాని చుట్టూ కథ అల్లేసి రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా చేసింది అదే. అయితే మన త్రివిక్రమ్ కి పురాణాలపై పట్టు ఇంకా ఎక్కువ. ఆయన కేవలం ఫ్యామిలీ సినిమాలే తీసినప్పటికీ.. అందులో పురాణాల ఇన్స్పిరేషన్ తో చాలా డైలాగులు ఉంటాయి. అయినా సరే మన త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు ఎందుకు చెయ్యట్లేదు. ఒకవేళ చేస్తే కేవలం ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తే సరిపోదు.లార్జ్ స్కేల్ ఐడియాలు మాత్రమే పనిచేస్తాయి. మరి ఈ విషయంలో త్రివిక్రమ్ ఆలోచన ఎలా ఉందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus