సినిమాకు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుంది అంటే చెప్పడానికి, రాయడానికి ఎన్ని వెబ్ పేజీలైనా సరిపోవు. ఒకప్పుడు ఏ విషయం చెప్పాలన్నా మీడియాకు సమాచారం ఇచ్చే సినిమా జనాలు… ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ముక్క రాసేసి ‘తీసుకోండి’ అనేస్తున్నారు. అదెందు అనేది ఇక్కడ ప్రస్తావన కాదు కానీ… ఆ సోషల్ మీడియా విపరీత పోకడలు వల్ల ఇప్పుడు కొంతమంది సినిమా జనాలు వాటి నుండి దూరంగా వెళ్లిపోతున్నారు. దూరంగా వెళ్లేది కొన్ని రోజులే అయినా, అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది,
ఎవరెవరు అలా వెళ్లిపోతున్నారు, ఎందుకు వెళ్లిపోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగ మారింది. రీసెంట్‌గా అయితే యువ దర్శకుడు వెంకటేశ్ మహా ట్విటర్ అకౌంట్‌ను ఏకంగా ప్రైవేటు చేసేశారు. అంటే ఆ ఖాతా ఎవరికీ అందుబాటులో లేదు. అంతకుముందు లోకేశ్ కనగరాజ్ కూడా సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇలా చూస్తే పెద్ద లిస్టే ఉంది. అయితే కొన్ని కీలక పేర్లు చూస్తే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా గతంలో ఇదే పని చేశారు.
అయితే వీరంతా ట్విటర్ ఖాతాకు దూరంగా ఉన్నవాళ్లు. అయితే వీళ్లు కాకుండా మరికొంతమంది సినీ జనాలు పెట్టి ట్వీట్లను డిలీట్ చేసేస్తున్నారు. వాళ్ల ఆలోచనను ట్వీట్ చేశాక వచ్చే స్పందన విపరీతంగా ఉండటంతో ట్వీట్లు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అలా ట్వీట్లు డిలీట్ చేసిన వాళ్లలో గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి, నిర్మాత నాగవంశీ ఉన్నారు. మొన్నీమధ్య ‘యానిమల్’ సినిమా విడుదల తర్వాత కథానాయిక త్రిష (Trisha) కూడా ఇలానే సినిమా గురించి ట్వీట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేశారు.
ట్వీట్ల కారణంగా ఇబ్బందిపడినవాళ్లలో సంగీత దర్శకుడు తమన్, కథానాయిక సమంత ఉన్నారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు చాలామంది ట్రోలింగ్ బారిన పడి ట్విటర్‌కు, సోషల్ మీడియాకు దూరమవుతున్నారు. గతంలో సినిమావాళ్లే పెంచి పోషించిన ఈ సోషల్ మీడియా సంస్కృతి ఇప్పుడు వాళ్లకే ఇబ్బందిపెడుతోంది అని చెప్పాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఏ స్థాయిలో చేరుతుందో చూడాలి.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!