బిగ్‌బాస్‌4: బిగ్‌బాస్‌… ఈ వారం కూడా అంతేనా ?

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల లిస్ట్‌ చూసినప్పుడు చాలా మంది అవాక్కయ్యారు. ఈ సారి ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నట్లున్నారు… అంటే టైటిల్‌ విజేత ఈసారి అమ్మాయేనా అనుకున్నారు. ఇంట్లో అమ్మాయిలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది అని కూడా అనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇంకోలా అనిపిస్తోంది. కారణంగా వరుసగా ఇంటి నుంచి అమ్మాయిలు బయటకు వస్తుండటం. తొలి ఎలిమినేషన్‌ తప్పించి… అక్కడణ్నుంచి అందరూ అమ్మాయిలే బయటకు వస్తున్నారు.

బిగ్‌బాస్‌ ఇంటి నుంచి తొలిగా బయటకు వెళ్లిపోయింది సూర్యకిరణ్‌. ఇంట్లో అందరి విషయంలో కలుగజేసుకుంటున్నాడని ఆయన్ని బయటకు పంపించేశారు. ఇక అక్నణ్నుంచి మొదలు ఇంట్లో మహిళల డామినేషన్‌ కాదు మహిళల ఎలిమినేషన్‌ మొదలైంది. ఎలాగోలా అబ్బాయిల్ని సేవ్‌ చేయాలి అనుకుంటున్నట్లుగా వరుసగా అమ్మాయిల్ని ఎలిమినేట్‌ చేసేస్తున్నారు. కళ్యాణితో మొదలైన ఈ వరుస… సుజాత వరకు వచ్చింది. కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్‌, గంగవ్వ, సుజాత ఇలా వీరందరూ బయటకు వచ్చేశారు. అందులో గంగవ్వ తనంతట తాను బయటకు వచ్చేసిందనుకోండి.

ఇంట్లోకి తొలి వారం వచ్చిన 16 మందిలో 9 మంది అమ్మాయిలు ఉండేవారు. ఏడుగురు అబ్బాయిలు ఉండేవారు. తర్వాత ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి వచ్చారు. అంటే మొత్తంగా ఇంట్లో 10 అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు వచ్చారు. అలా సభ్యలు లెక్కలోనే కాదు… బయటకు వెళ్లినవారిలో లెక్కలోనూ అమ్మాయిలే ఎక్కువ. అంటే ఐదుగురు అమ్మాయిలు బయటకు వెళ్లిపోగా, ఒక అబ్బాయి వెళ్లిపోయాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు, ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు.

ఈ వారం నామినేషన్‌లో ఉన్న 9 మందిలో ఐదుగురు అమ్మాయిలే ఉన్నారు. అంటే ఇక్కడా వాళ్లదే ప్రాధాన్యత. అయితే ఇది ఎవరూ కోరుకోని ప్రాధాన్యత. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ సారి కూడా అమ్మాయే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అలా అయితే ఆనవాయితీ కొనసాగిస్తారా? అనేది చూడాలి. ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఆరియానా, మోనాల్‌, దివి, లాస్య, హారికలో ఎవరో ఒకరు వెళ్లిపోతారని సమాచారం. ఒకవేళ అమ్మాయి కాకపోతే కుమార్‌ సాయి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. చూద్దాం ఈసారి ఆనవాయితీ సాగుతుందా లేదో.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus