Bigg Boss 5 Telugu: హౌస్ లో అందరూ ఎందుకు టార్గెట్ చేశారు..?

బిగ్ బాస్ హౌస్ లో ఏ వారం ఎవర్ని ఎందుకు టార్గెట్ చేస్తారో ఎవరికీ అర్ధం కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు రీజన్స్ చెప్తూ నామినేషన్స్ ప్రక్రియ అనేది చేస్తుంటారు. ఇందులో భాగంగానే 5వ వారం నామినేషన్స్ హౌస్ ని హీటెక్కించాయి. షణ్ముక్ ని ఏకంగా 8మంది హౌస్ మేట్స్ నామినేట్ చేయడం అనేది ఆసక్తిని కలిగించింది. అంతేకాదు, ఇప్పటివరకూ షణ్ముక్ ని నామినేట్ చేయని వాళ్లు కూడా షణ్ముక్ ని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. నిజానికి ఫస్ట్ వీక్ నుంచీ సేఫ్ గా గేమ్ ఆడుతున్న షణ్ముక్ ఇంటి సభ్యులు ఎవరూ తనని నామినేట్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు.

సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉన్న కారణంగా షణ్ముక్ ని గత కొద్దివారాలుగా ఎవరూ టార్గెట్ చేయలేదు. అయితే, శనివారం నాగార్జున ఎపిసోడ్ లో సిరికి ఇంకా షణ్ముక్ కి మిర్చిలు ఇచ్చి కొరకమని చెప్పాడు. అంతేకాదు, గేమ్ లో ఫైర్ మిస్ అయ్యిందని, ఆట బాగా ఆడమని హింట్ ఇచ్చాడు కింగ్ నాగ్. దీంతో ఒక్కసారిగా గేమ్ ని స్టార్ట్ చేశాడు షణ్ముక్. నాగార్జున ఎందుకు అలా అన్నారు అనేది సిరితో, ఇంకా జెస్సీతో డిస్కస్ చేశాడు. అంతేకాదు, రాత్రిపూట పింకీ తన బెడ్ దగ్గరకి వస్తే తన బ్రైయిన్ కూడా వాష్ చేశారు. నాగ్ సర్ ఇచ్చే హింట్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలి అంటూ మాట్లాడాడు.

ఇక నామినేషన్స్ లో ఒక్కొక్కరుగా కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి సీక్రెట్ నామినేషన్స్ చేశారు. బిగ్ బాస్ మాత్రం ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు అనేది పార్టిసిపెంట్స్ కి క్లియర్ పిక్చర్ ఇచ్చాడు. దీంతో షణ్ముక్ ని ఏకంగా 8మంది నామినేట్ చేశారని తెలిసింది. అక్కడిక్కడే నాకు కావాల్సింది ఇదే.. సూపర్ అంటూ షణ్ముక్ మాట్లాడాడు. ఇక ఇక్కడ్నుంచీ నా గేమ్ చూపిస్తానంటూ షణ్ముక్ ఛాలెంజ్ విసిరాడు. నాగార్జున ఇచ్చిన మిర్చి హౌస్ మేట్స్ కి హింట్స్ గా మారిందా ? అందుకే షణ్ముక్ ని అంతమంది టార్గెట్ చేశారా అనేది చూడాలి. అంతేకాదు, షణ్ముక్ తో పాటుగా ఉన్న సిరిని ఈసారి ఎవ్వరూ నామినేట్ చేయకపోవడం అనేది గమనార్హం. అదీ మేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus