Krish, Pawan Kalyan: పవన్‌ – క్రిష్‌ సినిమాపై కొత్త రకం పుకార్లు… నిజమేనా?

  • May 26, 2022 / 11:15 PM IST

సినిమా అనౌన్స్‌ చేసి రెండేళ్లు దాటిపోయింది. సినిమా షూటింగ్‌ మొదలు అయ్యిందని అధికారికంగా చెప్పి మూడు నెలల తక్కువ రెండేళ్లు అవుతోంది. సినిమా పేరు అధికారికంఆ అనౌన్స్‌ చేసి ఏడాది దాటిపోయింది. కానీ ఇంకా సినిమా విడుదలకు సిద్ధం కాలేదు. ఇంకా చెప్పాలంటే షూటింగే పూర్తవ్వలేదు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ సినిమా ఏంటో, ఇంకా కాలేదంటే ఆ సినిమా పేరు ‘హరి హర వీరమల్లు’. అవును ఈ సినిమా గురించి ఈ లెక్కంతా.

‘హరి హర వీరమల్లు’ సినిమా ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయి. తొలుత కరోనా పరిస్థితులు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ వేరే సినిమా కమిట్‌మెంట్లు, రాజకీయ కార్యక్రమాలు ఇలా చాలానే ఉన్నాయి. అయితే వీటితోపాటు సినిమా నాణ్యత కూడా ఒక కారణం అనే పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమా కోసం వేస్తున్న సెట్లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ విషయంలో పవన్‌ కల్యాణ్‌ సంతృప్తిగా లేరని, అందుకే సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ వరుసగా వాయిదా పడుతున్నాయని అంటున్నారు.

అయితే చిత్రబృందం నుండి ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఎప్పటికప్పుడు పవన్‌ కల్యాణ్‌ కోసం వెయిట్‌ చేయడం, ఆయన సెట్స్‌లోకి వచ్చినట్లు ఓ ఫొటో విడుదలవ్వడం జరిగిపోతున్నాయి. పవన్‌ డెడ్‌లైన్‌ పెట్టి డేట్స్‌ ఇచ్చాడని, త్వరలోనే సినిమా పూర్తి అని అంటున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఇంకా షూటింగ్‌ చాలా ఉంది అంటున్నారు. సెట్స్‌, సినిమా నిర్మాణంలో నాణ్యత సమస్యలు వచ్చే పవన్‌ ఆగుతున్నారని టాక్‌.

హరిహర వీరమల్లు…పవన్ కళ్యాణ్..క్రిష్ కాంబినేషన్ లో నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న సినిమా. పవన్ కెరీర్ లోనే ఇంత సుదీర్ఘంగా నిర్మాణంలో వున్న సినిమా మరోటి లేదేమో? ఏనాడో జమానా కాలం నాడు ఇచ్చిన అడ్వాన్స్. ఈ నెల 12న నుండి జరగాల్సిన షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేశారట. దీంతో సినిమా కోసం రూపొందించిన రెండు భారీ సెట్లు అలానే పడున్నాయట. దసరాకు విడుదల అనుకున్న సినిమా ఇంకా పెండింగ్‌ ఉండటంతో విడుదల వాయిదా పక్కా అంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus