అతనంటే హౌస్‌మేట్స్‌కు ఎందుకంత కోపం

మీతోపాటు బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్నవాళ్ల గురించి చెప్పండి అంటే… మొన్నటివరకు అందరూ మంచివాళ్లే అనేవారు. అయితే గత వారం పరిస్థితి మారింది. ‘ఉక్కు హృదయం’ టాస్క్‌తో ఎవరి రంగేంటో తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో నాగార్జున వారితో ‘ట్రూత్‌ టవర్‌’ గేమ్‌ ఆడించాడు. పిల్లలు సరదాగా ఆడుకునే జంగా టవర్‌ గేమ్‌ అన్నమాట. టవర్‌లో ఓ బ్లాక్‌ను జాగ్రత్తగా తీసి నాగార్జున అడిగిన ప్రశ్నకు ఆ హౌస్‌మేట్‌ సమాధానం చెప్పాలి. అయితే ఈ ఆటను నామినేషన్‌లో ఉన్నవారికే ఇచ్చారు.

‘ఇంట్లో నీకు పోటీ కాదు అనిపించేది ఎవరు?’ అంటూ హారికను అడిగితే కుమార్‌ సాయి అని చెప్పింది. ఇంట్లో సోహైల్‌ నారదుడులా వ్యవహరిస్తున్నాడని మోనాల్‌ చెప్పింది. అయితే మోనాల్‌ ఇంట్లో ఉత్తమ అబద్దాల కోరు అని లాస్య అంది. ‘ఎలిమినేట్‌ అయిన ఇంటి సభ్యులను తీసుకొచ్చి ఒకరిని పంపించేద్దాం అంటే ఎవరిని పంపిద్దాం’ అని దేవీ నాగవల్లిని అడిగితే… కుమార్‌ సాయి పేరు చెప్పింది. ఇంకా కుమార్‌సాయి విషయంలో క్లారిటీ రాకపోవడం వల్లే ఆ పని చేశా అని కూడా చెప్పింది.

ఇంట్లో బాగా చికాకు తెప్పించే వ్యక్తి ఎవరు అని ఆరియానాను అడిగితే… సోహైల్‌ పేరు చెప్పింది. ఇక ఆటోమేటిక్‌గా సోహైల్‌ లేచి ఆరియానా పేరు చెప్పాడు. ఇంట్లో నేచురల్‌గా ఉండాలి అని నేను అనుకుంటాను. కానీ సోహైల్‌ వచ్చి అలా మారు, ఇలా చేయ్‌ అంటాడు. నాకు అది నచ్చదు అని ఆరియానా వివరణ ఇచ్చింది. ఇంట్లో ఉండటానికి అర్హత లేనివాడు ఎవరు అంటే మెహబూబ్‌ కూడా కుమార్‌ సాయి పేరే చెప్పాడు.

ఇక్కడ ఈ టాస్క్‌లో అసలు మజా మొదలైంది. ఇంట్లో ఉన్నవారిలో అత్యంత నకిలీ వ్యక్తి ఎవరు అని కుమార్‌సాయిని నాగార్జున అడిగారు. దానికి కుమార్‌సాయి ముందుగా అనుకున్న విధంగా అభిజీత్‌ పేరు చెప్పేశాడు. బయటకు చాలా పద్ధతిగా మాట్లాడే అభిజీత్‌… వెనుక తిడుతుంటాడు అని వివరణ ఇచ్చాడు. అఖిల్‌ విషయంలో కూడా ఇలానే తక్కువ చేసి మాట్లాడాడు అంటూ పాత విషయాలను తవ్వాడు కుమార్‌ సాయి. దీంతో అఖిల్‌ – అభిజీత్‌ – కుమార్‌సాయి మధ్య మళ్లీ చర్చ జరిగింది. అయితే ఎప్పుడో జరిగిపోయి, సమసిపోయిన విషయాన్ని కుమార్‌సాయి ఎందుకు మళ్లీ రేపాడో అతనికే తెలియాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus