Koratala Siva: సోషల్‌ మీడియాకు కొరటాల గుడ్‌బై అందుకేనా

‘సోషల్ మీడియాకు దూరంగా వెళ్లిపోతున్నాను’… అంటూ ఇటీవల కొరటాల శివ ప్రకటించారు. ఉరుములు, మెరుపులు లేకుండా భారీ వర్షం కురిసినట్లు… ఏమీ జరగకుండా, ఆయనను ఎవరూ ఏమీ అనకుండా ఎందుకు సోషల్‌ మీడియా నుండి తప్పుకున్నారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనికి సమాధానం ఇవ్వడానికి ఇప్పటిప్పుడు కొరటాల శివ మాట్లాడే పరిస్థితి లేదు. అయితే ఆయన బయటకు వెళ్లిపోవడానికి కారణం ఫ్యాన్సే అనే మాట గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయన ఫ్యాన్స్‌ కాదు… హీరోల ఫ్యాన్స్‌ అని చెప్పుకునే కొంతమంది వల్లే అని తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో ఫ్యాన్ వార్‌ ఈ మధ్య ఎక్కువైపోయింది. ఒక హీరో ఫ్యాన్స్‌, మరో హీరోను తిట్టిపోస్తున్నారు. ఎందుకు తిడుతున్నారు, ఏం తిడుతున్నారు అనేది కూడా తెలియడం లేదు. మధ్యలో అభం శుభం తెలియని వారిని కూడా లాగేస్తున్నారు. హీరోల ఫ్యాన్స్‌ మధ్యలో ఒక్కోసారి దర్శకులు నలిగిపోతున్నారు కూడా. ఆ హీరోను బాగా చూపించారు, మరి మా హీరోనేంటి ఇలా చూపించారు అనే మాట చాలాసార్లు సోషల్‌ మీడియాలో చూసుంటాం. ఇప్పుడు ఇలాంటి సమస్యతోనే కొరటాల సోషల్‌ మీడియా నుండి దూరంగా వచ్చేశారని టాక్‌.

కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా మొదలవబోతోంది. దీని తర్వాత ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కించే సినిమా మొదలవుతుంది. ఈ రెండు సినిమాల మధ్యలో… ఫ్యాన్స్‌ చేతిలో నలిగిపోకూడదనే కొరటాల సోషల్‌ మీడియా నుండి దూరంగా వచ్చేశారని టాక్. గతంలో ఇలాంటి పరిస్థితి బోయపాటి శ్రీనుకి కూడా ఎదురైన విషయం తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ సమయంలో వేరే హీరోతో బోయపాటి తీసిన సినిమాలను పోలుస్తూ సోషల్‌ మీడియాలో ఆడిపోసుకున్నారు. ఇదంతా చూసే కొరటాల ఇప్పుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నారని టాక్‌.


Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus