పెద్ద వాళ్లు చెప్పేటప్పుడు వినాలి అంటారు? వింటేనే బాగుపడతావు అని కూడా అంటారు! అయితే ఆ చెప్పే మాటల్లో లాజిక్ లేకపోతే ఎంత విన్నా, ఆచరించినా ఉపయోగం లేదు అని చెప్పాలి. ఆ పెద్ద మనిషిని మనం ఏమీ అనం, అనకూడదు కానీ.. లాజిక్ మిస్ అయితే మిస్ అయింది అనుకోవడంలో తప్పులేదు. అందుకే ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పెద్ద మనిషి కోట శ్రీనివాసరావు అయితే.. ఆ విషయంలో హీరోల రెమ్యూనరేషన్ ప్రకటన
టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే దేశ సినీ పరిశ్రమలో కోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేరనే చెప్పొచ్చు. ఆయన వేసిన వైవిధ్యమైన వేషాలు.. చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవల కాలంలో ఆయన వివిధ సందర్భాల్లో ప్రస్తావించే విషయాలు.. చెబుతున్న మాటల విషయంలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. దీంతో ఆయన ఇలా ఎందుకు అంటున్నారు అనే చర్చ మొదలైంది. తాజాగా హీరోల రెమ్యూనరేషన్‌పై ప్రకటన కూడా ఇలానే మారింది.
ఇటీవల జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో (Srinivasa Rao) కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హీరోల రెమ్యునరేషన్ల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ నుండి శోభన్ బాబు దాకా ఎవరూ తమ పారితోషికాలను బయటికు చెప్పేవారు కాదని… కానీ ఇప్పుడు మైకు పట్టుకుని నాకు రోజుకు రూ.రెండు కోట్లు రూ. నాలుగు కోట్లు ఇస్తున్నారని పబ్లిక్‌గా చెబుతున్నారని.. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని అన్నారు కోట.
అయితే.. ఈ విషయంలో తప్పేమి ఉందని సగటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు తమ సంపాదన గురించి బయటకు చెప్పుకుంటారని.. అలా హీరోలు కూడా తమన రెమ్యూనరేషన్ చెబితే తప్పేంటి అని అంటున్నారు. తెలుగు సినిమాల్లో ఇతర బాషల నటీనటులను తీసుకోవడం పట్ల గతంలో ఓ సందర్భంలో కోట ఆక్షేపించారు. కానీ ఈయనే తమిళంలో ‘సామి’, ‘సెల్యూట్’ లాంటి సినిమాల్లో నటించారు. అప్పుడు ఈ విషయంల అడిగితే మాట దాటేయడం గమనార్హం.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు