Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

గతేడాది సంక్రాంతికి మహేష్ బాబు “గుంటూరు కారం”, తేజ సజ్జా “హనుమాన్” పోటీపడి విడుదలవ్వగా.. “హనుమాన్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, “గుంటూరు కారం” డిజాస్టర్ అయ్యింది. అప్పటినుంచి మహేష్ ఫ్యాన్స్ అందరూ తేజ మీద పగ పెంచేసుకున్నారు. తేజ & టీమ్ కావాలని సింపతీ గేమ్ ఆడి, ఆడియన్స్ ను తమవైపుకి తిప్పుకున్నారని గేలి చేశారు. సరే అది ఏడాది క్రితం మేటర్ కదా అనుకుంటే.. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ కట్టగట్టుకుని తేజ సజ్జను టార్గెట్ చేస్తున్నారు.

Teja Sajja

నిన్న వైజాగ్ లో జరిగిన “మిరాయ్” ప్రీరిలీజ్ ఈవెంట్లో తేజ మాట్లాడుతూ.. “రాబోయే ఓజీ, కల్కి 2, కాంతార 2, #SSRMB సినిమాలు మన తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచుతాయి” అన్నాడు. చెప్పాలంటే ఇది మంచి మాటే.

కానీ మహేష్ ఫ్యాన్స్ మూటగట్టుకొని తేజ మీద పడిపోయారు. “#SSMB29 అనే అనాలి కానీ.. #SSRMB అనడం ఏంటి?” అని అతడి మీద విరుచుకుపడ్డారు. నిన్న రాత్రి మొదలైన సోషల్ మీడియా హేట్రెడ్ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. నిజానికి తేజ అన్నదాంట్లో తప్పేమీ లేదు. #SSMB29 అని మహేష్ ఫ్యాన్స్ అంటుంటే.. కొందరు #SSRMB అని కూడా అంటున్నారు. అలాంటప్పుడు తేజ #SSRMB అనడంలో తప్పేముందో అర్థం కావడం లేదు.

మహేష్ ఫ్యాన్స్ ఇలా ప్రతి అనవసరమైన దానికి రియాక్ట్ అయ్యి వాళ్ల క్రెడిబిలిటీని పోగొట్టుకొంటున్నారు. ఒకరకంగా తేజకి ఇది నెగిటివ్ అయితే.. ట్రోల్స్ లాంటి ఈ నెగిటివ్ పబ్లిసిటీ కారణంగా ఈ సినిమా మరింత మందికి చెరువవుతుంది. మరి మహేష్ అభిమానులు ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకుంటే సరి. లేదంటే కొందరు ఫ్యాన్స్ చేసే ఈ రచ్చ వల్ల.. మొత్తం ఫ్యాన్ బేస్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది.

 

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus