మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఎన్నికలు ఉండకూడదు. అధ్యక్షుడు, కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలి. టాలీవుడ్‌లో ఏ సీనియర్‌ని అడిగినా ఇదే మాట చెబుతారు. అంతెందుకు ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, అతని తండ్రి మోహన్‌బాబు, విష్ణు శ్రేయోభిలాషి నరేశ్ కూడా ఇదే మాట చెప్పారు. అయితే ఆ దిశగా ప్రయత్నం చేస్తే మాత్రం ‘కాదు’ అన్నారు. అంతేకాదు ఆ ప్రయత్నాన్ని ఏదో ‘తప్పు’ అనే రేంజిలో చెప్పడం గమనార్హం. డౌటుంటే… ఒకసారి మంచు విష్ణు జులై 12న విడుదల చేసిన వీడియో చూడండి. ఏడు నిమిషాల వీడియోలో ఆరో నిమిషం నుండి చూసినా అర్థమైపోతుంది.
‘‘మ’ లో సీనియర్, కీలక సభ్యులైన వారు మందుకొచ్చి… ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిస్తే నేను సిద్ధం. అలా జరిగితే నేను ఎన్నికల నుండి తప్పుకుంటాను’’ అని స్పష్టంగా చెప్పారు మంచు విష్ణు. ఆయన మాట వినో, లేక ఎన్నికలు ఎందుకు అనుకునో చిరంజీవి… మోహన్‌బాబుకు ఫోన్ చేసి ‘ప్రకాశ్ రాజ్ పోటీలో ఉన్నాడు కదా… విష్ణును తప్పుకుంటే బాగుంటుంది’ అని అడిగారు. ఈ మాట కూడా విష్ణు చెప్పిందే. అయితే మోహన్‌బాబు, విష్ణు ‘చిరంజీవి మాట’ను అంగీకారం తెలపలేదు. పోటీలో నిలబడ్డారు… గెలిచారు కూడా.
అయితే… ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత విష్ణు… మీడియాతో మాట్లాడుతూ ‘చిరంజీవి గారు నన్ను ఎన్నికల నుండి తప్పుకోమని కోరారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే… విష్ణు ఆ ప్రతిపాదన చేశాకనే చిరంజీవి ఫోన్ చేశారు. అందులో తప్పేం లేదు కదా. ఒకవేళ చిరంజీవి ప్రతిపాన నచ్చినా… అభ్యర్థిగా నిలిపిన/ ఏకగ్రీవం చేద్దామనుకున్న వ్యక్తి నచ్చకపోతే ఆ విషయమే చెప్పాల్సింది. అప్పుడు ఆ విషయం చెప్పకుండా… ఎన్నికలయ్యాక ‘చిరంజీవిగారు నన్ను పక్కకు తప్పుకోమన్నారు’ అని విష్ణు అనడం ఎంతవరకు కరెక్టో ఆయనే చెప్పాలి.
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు