మోహన్‌బాబు వర్సెస్ చిరంజీవి లేదంటే చిరంజీవి వర్సెస్ మోహన్‌బాబు. పేరు ఏదైనా.. ఈ రైవల్రీ మాత్రం గతం కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. చిరంజీవి ఓ విషయం చెబితే.. మోహన్‌బాబు ఓ మాట అంటారు. మోహన్‌బాబు ఓ మాట అంటే.. నాగబాబు ఇంకో కౌంటర్ వేస్తారు. అయితే ఈ స్నేహపూర్వక (?) పోటీలో కొత్త యాంగిల్ కనిపిస్తోంది. అదే నువ్వేం చేస్తే.. నేనూ అదే చేస్తా! ఇదెక్కడో విన్నట్లుగా ఉంది కదా. చిన్న పిల్లలు ఈ మాట అంటూ ఉంటారు. వాడు చేశాడు, నేనూ చేస్తా అని. అచ్చంగా అలానే ఉంది పరిస్థితి.
అయితే ఇప్పుడు పోటీ చిరంజీవి, మోహన్‌బాబు మధ్య కాదు. చిరు – మంచు విష్ణు మధ్య అని చెప్పొచ్చు. ‘గాడ్ ఫాదర్’ సినిమా, ‘జిన్నా’ చిత్రం ఒకేసారి విడుదలవుతాయి అనే మాట వచ్చినప్పటి నుండి ఈ ఆహ్లాదకర పోటీ మొదలైంది అని చెప్పాలి. ఆ సినిమా షూటింగ్ సమయంలో తెలియకుండా చిన్నగా మొదలైన ఈ పోటీ పనులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి అని అంటున్నారు. తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు సినిమా చేస్తాడు అని ఓ వార్త బయటికొచ్చింది. దీంతో ఆ చర్చ ఎక్కువైంది అని చెప్పొచ్చు.
గతంలోనూ ప్రభుదేవా విషయంలోనే ఈ చర్చ జరిగింది అని చెప్పాలి. ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ‘తార్ మార్ తక్కర్ మార్..’ అనే పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అని వార్తలొచ్చాయి. ఆ వెంటనే మంచు విష్ణు కూడా తన సినిమా ‘జిన్నా’లో ప్రభుదేవా పాట ఒకటుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘గోలీసోడా..’ అంటూ ఆ పాట తర్వాత వచ్చింది కూడా. అయితే ఏ పాట గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ తర్వాత సినిమా ప్రచారంలోనూ ఈ పోటీ కనిపించింది.
‘గాడ్‌ఫాదర్’ రిలీజ్ సమయంలో చిరు – ప్రభుదేవా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది అని ఓ వార్త వచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ముచ్చట్లేం లేవు. అయితే ఇప్పుడు మంచు విష్ణు కూడా ప్రభుదేవాతో ఓ సినిమా అనుకుంటున్నాడు అని వార్తలొస్తున్నాయి. దీంతో చిరంజీవి ఏం చేస్తే విష్ణు అది చేయడానికి రెడీ అవుతున్నాడు అని విసుర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇది విష్ణు కావాలనే చేస్తున్నాడా? లేక సోషల్ మీడియా, మీడియాలో ఎవరైనా చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. అయితే విష్ణు ఇటీవల వివిధ భాషల నుండి అరడజను సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొన్నాడు. వాటిలో ఓ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!