స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యి… చాలా రోజులైంది. ఇప్పటికే చాలామంది నటులు, రాజకీయ నాయకులు ఆయనను కలసి అభినందించి వచ్చారు. కొంతమంది అయితే ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వంతుగా కొంత సాయం కూడా అందించారు. అయితే ఇన్నాళ్లూ లేని ఓ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్… స్టాలిన్ గురించి మాట్లాడుతుండటం. ముందుగా చిరంజీవి గురించి చూద్దాం… నిన్న ఆయన చెన్నై వెళ్లి మరీ స్టాలిన్‌ను కలిశారు.
ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సమయంలో స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా స్టాలిన్ గురించి స్పందించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ వ్యవహరిస్తున్న తీరును పవన్ ప్రశంసించారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేసి చూపిస్తున్నారు అంటూ పొగిడేశారు.
అయితే ఇక్కడ ఒకటే డౌట్. స్టాలిన్‌ను చిరంజీవి కలవడం, మరోవైపు పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా ప్రశంసించడం కాకతాళీయమా… లేక అనుకోని చేసి పనా అనేది అర్థం కావడం లేదు. ఇన్నాళ్లుగా స్టాలిన్‌ను కలవని చిరు ఇప్పుడెందుకు కలిశారు, పవన్ ఎందుకు ట్వీటారు అనేది టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. అయితే మెగా కుటుంబానికి ఎప్పటి నుండో స్టాలిన్ కుటుంబంతో అనుబంధం ఉంది.