Kalyan Dev: కళ్యాణ్‌దేవ్‌ హీరో అవ్వడం వారికి నచ్చలేదా?

కల్యాణ్‌దేవ్‌ హీరో అవ్వడం మెగా కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదా? ఏమో ఆయన సినిమాలను మెగా స్టార్‌ అండ్‌ కో. లైట్‌ తీసుకోవడం చూస్తుంటే అలానే అనిపిస్తోంది. కల్యాణ్‌ గత చిత్రం ‘విజేత’ నుండి చూస్తున్నాం… ఎక్కడా కల్యాణ్‌దేవ్‌ సినిమా ప్రచారానికి మెగా కుటుంబం నుండి హీరోలు రావడం లేదు. తాజాగా ‘సూపర్‌ మచ్చి’ విషంయలోనూ ఇదే జరుగుతోంది. సినిమా ట్రైలర్‌ను కామ్‌గా వాళ్లకు వాళ్లే లాంచ్‌ చేసుకున్నారు తప్ప… ఏ మెగా హీరో కూడా ముందుకు రాలేదు. లేదంటే కల్యాణ్‌ దేవ్‌ పిలవలేదా అనేది తెలియడం లేదు.

మెగా కుటుంబం నుండి ఓ హీరో మరో హీరో సినిమాకు ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో గతంలో చాలా సార్లు చూశాం. ఆ కిక్‌ కోసం కుర్ర హీరోలు ఉన్న అవకాశాలన్నింటినివాడేసి మెగా హీరోలను తమ సినిమాల ప్రచార కార్యక్రమాలకు తీసుకొస్తుంటారు. వాళ్లు కూడా అదే జోష్‌లో వచ్చి సినిమాను ఆశీర్వదిస్తుంటారు. అయితే ఇది కల్యాణ్‌ దేవ్‌ సినిమాల విషయంలో ఎందుకు జరగడం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. ‘సూపర్‌ మచ్చి’ సినిమా ప్రచారంలోనూ మెగా హీరోలు ఎవరూ కనిపించడం లేదు. సొంతంగా కల్యాణ్‌ దేవే సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు.

పోనీలే కరోనా కదా మెగా హీరోలు ఎవరూ బయటకు రావడం లేదు అంటే ఓకే అనుకోవచ్చు. కానీ అన్ని రకాల కార్యక్రమాలకు మెగా హీరోలు బయటకు వస్తున్నారు. అంతెందుకు బుధవారం జరిగిన ‘రౌడీ బాయ్స్‌’ మ్యూజికల్‌ ఈవెంట్‌కి రామ్‌చరణ్‌ స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చాడు. అలాంటిది ‘సూపర్‌ మచ్చి’ ఈవెంట్‌కి రాకుండా ఉంటారా. అంటే ఇక్కడ కళ్యాణ్‌దేవ్‌కి సోలోగా రాణించాలనే ఉద్దేశమైనా ఉండాలి. లేదంటే మెగా హీరోలకు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా రావడం అయినా ఇష్టం లేకపోయుండాలి. లేకపోతే ఎందుకు ప్రచారానికి రాకుండా ఉంటారు చెప్పండి.

సినిమా ప్రారంభానికి రాకపోయినా ఓ లెక్క. ఏకంగా సంక్రాంతి సీజన్‌కు పెద్ద సినిమాలతో పోటీ పడుతుంటే… కుటుంబ సభ్యులు వచ్చి చీరప్‌ చెయ్యాలి కదా. ‘విజేత’ సమయంలో కాస్త ఆ ప్రోత్సాహం కనిపించినా ‘కిన్నెరసాని’, ‘సూపర్‌ మచ్చి’ విషయంలో అస్సలు కనిపించడం లేదు. మరోవైపు చిత్రబృందం కూడా అంతగా ప్రచారం చేయడం లేదనే వాదనా వినిపిస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus