Naga Shaurya: నాగశౌర్యకు అంత కోపం ఎందుకో? అంతగా ఏమైందబ్బా?

సినిమాలను స్పూఫ్‌ చేయడం చూసుంటారు, సీరియళ్లను స్పూఫ్‌ చేయడం చూసుంటారు, లేదంటే రాజకీయ నాయకుల మాటలను స్పూఫ్‌ చేయడం చూసుంటారు. కానీ ఇంటర్వ్యూలను స్పూఫ్‌ చేయడం చూశారా? గతంలో ఒకరిద్దరు నటులు ఈ పని చేశారు. అయితే ఏదో ఒక యాంకర్‌ను స్పూఫ్‌ చేశారు వాళ్లంతా. కానీ ఒకేసారి ఐదుగురిని స్పూఫ్‌ చేయడం చూస్తారా? అయితే ‘రంగబలి’ టీమ్‌ నుండి లేటెస్ట్‌గా వచ్చిన ప్రమోషనల్‌ వీడియో చూడాల్సిందే. నాగశౌర్య, సత్య కలసి ఈ వీడియో చేశారు.

సత్య మిమిక్రి బాగా చేస్తాడని తెలిసినా.. ఎప్పుడూ దానిని సినిమాల్లో చూపించలేదు. అయితే ‘రంగబలి’ కోసం చేసి చూపించారు. ఓ వీడియోలో నాగశౌర్యని ఇంటర్వ్యూ చేస్తూ మీడియాలో వివిధ యాంకర్లను అచ్చు గుద్దినట్టు ఇమిటేట్ చేశాడు. న్యూస్ ఛానల్ అధిపతి, వెబ్ యాంకర్, వ్యాఖ్యాత, లేడీ జర్నలిస్ట్, కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగే రిపోర్టర్‌లను ఇమిటేట్‌ చేశాడు సత్య. అయితే అసలు టీమ్‌ ఈ వీడియో ఎందుకు చేసింది అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఏదో విషయంలో ఎంతో మండితే తప్ప ఇలాంటి వీడియోలు చేయరు.

ఈ నేపథ్యంలో నాగశౌర్య (Naga Shaurya) విషయంలో ఏం జరిగింది అనే చర్చ మొదలైంది. మొన్నామధ్య హైదరాబాద్‌లో ఓ చోట అమ్మాయి, అబ్బాయి గొడవపడుతుంటే నాగశౌర్య వెళ్లి ఆపబోయాడు. ఆ తర్వాత ఆ విషయం ఎటెటో తిరిగి తెగ వైరల్‌ అయ్యింది. అందులో తప్పెవరది అనే ప్రశ్న కూడా వినిపించింది. దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ తర్వాత శౌర్య ఇంటర్వ్యూల్లో దీనిపై ప్రశ్నల వర్షం కూడా కురిసింది. గతంలో కూడా కొన్ని విషయాల్లో శౌర్య మీడియాకు సమాధానాలు చెప్పాల్సి వచ్చింది.

దీంతో ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకుని నాగశౌర్య ఈ స్పూఫ్‌ వీడియో చేశారు అని అంటున్నారు. అయితే మరి సత్య ఎందుకు ముందుకొచ్చాడు అనేది కూడా ప్రశ్నే. కేవలం నటుడిగా ఆయన ఈ ప్రయత్నం చేశారా? లేక ఆయనకు కూడా ఏదైనా కోపం ఉందా అనేది తెలియాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus