కరోనా ప్రభావం కారణంగా టాలీవుడ్‌లో చాలా సినిమాలు ఓటీటీలోకి నేరుగా వచ్చేశాయి. అయితే ఇన్నాళ్లూ లేని సమస్య… ‘నారప్ప’ దగ్గరకు వచ్చేసరికి కనిపిస్తోంది. ఆ సినిమాను డైరెక్ట్ ఓటీటీకి ఇవ్వొద్దు అంటూ పంపిణీదారులు, ప్రదర్శనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అప్పటికే పూర్తయిన డీల్ నుండి నిర్మాత సురేశ్‌బాబు వెనక్కి రాలేదు. దీంతో సినిమాను ఈ నెల 20 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ వెనుక పెద్ద లెక్కే ఉందంటున్నారు.
టాలీవుడ్‌లో సినిమాల విడుదల అంటే శుక్రవారమనే చెప్పాలి. ఎప్పుడో గానీ డేట్ మారదు. నిజానికి ‘నారప్ప’సినిమాను కూడా అదే లాజిక్ మీద 23 లేదా 24 తేదీల్లో స్ట్రీమ్ చేయాలని అనుకున్నారట. దానికి తగ్గట్టే వారం ముందు ప్రచారం ప్రారంభిద్దామని అనుకున్నారట. కానీ సినిమా విడుదల తేదీని నాలుగు రోజులు ముందుకు తీసుకొచ్చి హడావుడిగా సోమవారం ప్రకటించారు. కారణం ఎగ్జిబిటర్లను ఇబ్బంది పెట్టకూడదనే అట. ఈ నెల 23 నుండి థియేటర్లు తెరుచుకుంటాయనే టాక్ ఒకటి టాలీవుడ్ వర్గాల్లో నడుస్తోంది.
అయితే ఆ రోజుకు ఏ సినిమాలు వస్తాయో తెలియదు కానీ… టాక్ అయితే ఉంది. దీంతో అదే రోజు ‘నారప్ప’ను ఓటీటీలోకి వస్తే ఎగ్జిబిటర్ల మనసు మరింత నొచ్చుకుంటుందని సురేశ్‌బాబు భావించినట్లు సమాచారం. అందుకే మూడు, నాలుగు రోజులు ముందుకు తెచ్చి సినిమాను 20న విడుదల చేస్తున్నారు. 20 అంటే ముందు రోజు రాత్రి పది తర్వాత ఎలాగూ సినిమా వచ్చేస్తుంది అనుకోండి.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్