Nikhil: నిఖిల్‌ తన సినిమాను వెనక్కి తీసుకెళ్లడం ఎందుకు?

‘నిఖిల్‌.. నీ కోసం నేనున్నా’ అంటూ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల స్టేట్‌మెంట్ ఇవ్వడం గురించి మీకు తెలిసే ఉంటుంది. విష్ణు ఎందుకు ఈ మాట అన్నారు, అసలేం జరిగింది అనేది తెలుసుకునే ముందు.. అసలు విష్ణు లాంటి వ్యక్తి మాటిచ్చినా నిఖిల్‌ తన సినిమాను ఎందుకు వెనక్కి జరుపుకున్నాడు. ఇప్పుడు ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. ఇదంతా నిఖిల్‌ రాబోయే సినిమా ‘కార్తికేయ 2’ గురించే అనే విషయం తెలిసిందే.

నిఖిల్‌ – అనుపమ పరమేశ్వర్‌ జంటగా చందు మొండేటి తెరెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. నిఖిల్‌ – స్వాతి జంటగా వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు ఇది సీక్వెల్‌ అని తెలిసిందే. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా.. కరోనా పరిస్థితులు, థియేటర్ల వద్ద పరిస్థితులు లాంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల కూడా రెండుసార్లు డేట్లు మార్చుకుంది. ఈ క్రమంలో ఆగస్టు 12న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు సినిమాను ఒక రోజు వాయిదా వేసి ఆగస్టు 13కి తీసుకొస్తున్నారు.

ఒక రోజు వాయిదాతో ఏమొస్తుంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఆ విషయం పక్కనపెడితే.. కొన్ని రోజుల క్రితం నిఖిల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ సినిమాను అక్టోబరు, నవంబరుకి వాయిదా వేసుకోమని అంటున్నారని, ఆ సమయంలో తను ఒక వారం పాటు ఏడ్చానని చెప్పారు. మీడియాలో ఈ విషయం రావడంతో ‘మా’ అధ్యక్షుడు విష్ణు స్పందిస్తూ.. ‘నీకు నేనున్నా’ అంటూ నిఖిల్‌ సిద్ధార్థ్‌కు భరోసా ఇచ్చాడు విష్ణు. ధైర్యంగా ఉండండి. మంచి కంటెంట్‌ ఎప్పుడూ విజయం సాధిస్తుందంటూ ‘కార్తికేయ 2’ టీమ్‌కు అండగా నిలిచాడు.

‘కార్తికేయ 2’ చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని కూడా చెప్పాడు. దానికి నిఖిల్‌ స్పందిస్తూ ‘‘విష్ణు అన్నా నీ మాటలు నాకు, ‘కార్తికేయ 2’ చిత్ర బృందానికి ఎంతో విలువైనవి ’’ అని చెప్పారు. అయితే ఏమైందో ఏమో ఇది జరిగి ఒకటి, రెండు రోజులకే ‘కార్తికేయ 2’ వాయిదా అంటూ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు ఒక రోజు వాయిదా వల్ల ఏం లాభం అనేది తెలియదు కానీ.. విష్ణు మాటిచ్చినా ఎందుకు వాయిదా వేశారు అనేది ఆలోచించాల్సిన అంశం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus