టాలీవుడ్ లో పవన్ టాప్ హీరోలలో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి ప్రవేశించాక మెగా ఫ్యాన్ బేస్ మొత్తం పవన్ వైపు వచ్చి చేరింది. ఇక పవన్ ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒక సినిమా చేసేవారు . దీనితో పవన్ సినిమా ప్రకటన తేదీ నుండి ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ నడిచేది. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. పవన్ నెలల గ్యాప్ లో మూడు సినిమాలు ప్రకటించారు. వాటిలో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అయినప్పటికీ వీటి గురించి అటు సామజిక మాధ్యమాలలో కానీ, బయట ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎటువంటి సందడి లేదు. ఒకప్పుడు పవన్ సినిమాలు, వాటిపై వచ్చే అప్డేట్ కి ఉండే ఆదరణ నేపథ్యంలో ప్రతి రోజు పవన్ సినిమాపై అప్డేట్, గాసిప్స్ నడుస్తూ ఉండేవి. కానీ ప్రస్తుతం కనీస చర్చ కూడా ఆయన చిత్రాలపై నడవడం లేదు.
పవన్ సినిమా విడుదలై రెండేళ్లు కావడం, ఆ చివరి సినిమా అజ్ఞాత వాసి కూడా డిజాస్టర్ కావడం కూడా ఒక కారణం కావచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కూడా తగ్గిపోవడం, జనరేషన్ మారిపోవడం కూడా ఇందుకు కారణం అయ్యే అవకాశం కలదు. ఇక పవన్ రెండు పడవల ప్రయాణ ధోరణి నచ్చక కొందరు ఆయన సినిమాల పట్ల మక్కువ చూపడం లేదు. పవన్ కమ్ బ్యాక్ మూవీ పింక్ పై కనీస ఆసక్తి కూడా ఫ్యాన్స్లో లేదు. ఎందుకనగా అది ఓ సోషల్ కాన్సెప్ట్ మూవీ. హిందీలో 70ఏళ్ళు పైబడిన అమితాబ్ చేసిన వృద్ద లాయర్ పాత్ర పవన్ చేస్తున్నారు. ఇక పవన్ కోసం కొన్ని మార్పులు చేసినప్పటికి ఫ్యాన్స్ ఆశించే డాన్సులు, పవన్ మార్కు బాడీ లాంగ్వేజ్, కామెడీ పంచ్ లు ఉండవు. కాబట్టి వారికి పింక్ రీమేక్ పై అంత ఆసక్తి లేదు. క్రిష్ మరియు హరీష్ శంకర్ చిత్రాలకే కొంచెం బజ్ నడుస్తుంది. ఏది ఏమైనా పవన్ రాజకీయాల కారణంగా సినిమాలలో తన వైభవం కొంత మేర కోల్పోయాడు.