Mahesh Babu: మహేష్‌ లుక్‌ బయటకు.. రాజమౌళి ప్లానింగ్‌ ఇదేనా?

రాజమౌళి (S. S. Rajamouli)  సినిమా అంటే ఓ ప్లానింగ్‌ ఉంటుంది. కొన్ని రూల్స్‌ ఉంటాయి. మరికొన్ని సంప్రదాయాలు ఉంటాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు మహేష్‌బాబు (Mahesh Babu)  సినిమాకు వర్తించవా? ఏమో మహేష్‌ చేస్తున్న పనులు, బయటికొస్తున్న లుక్‌లు చూస్తుంటే ఆయనకు ఆ రూల్స్‌ పట్టవేమో అనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి సినిమాలో మహేష్‌బాబు లుక్‌ ఎలా ఉంటుందో అధికారికంగానే తెలిసిపోయింది. ఇటీవలే మహేష్‌ కొత్త లుక్‌లో కనిపించాడు కూడా. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో, అభిమానుల్లో ఓ చర్చ జరుగుతోంది.

Mahesh Babu

ఆ చర్చ ప్రకారం చూసుకుంటే.. మహేష్‌కు రాజమౌళి ఇంకా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని అర్థమవుతోంది. మరోవైపు అసలు ఆంక్షలు పెట్టడానికి మహేష్‌ ఇంకా కొత్త లుక్‌లోకి రాలేదు కదా అని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు బయటికొచ్చిన లుక్‌లు ఫైనల్‌ కాలేదు అని ఆ పుకార్ల సారాంశం. ఇంకా సినిమా లుక్‌ విషయంలో ఓ నిర్ణయం జరగలేదని తేల్చేస్తున్నారు. ఎందుకంటే మహేష్‌బాబు ఇటీవల కాలంలో రెండు, మూడు రకాల లుక్‌లలో కనిపించాడు.

మరోవైపు మహేష్‌ లుక్స్‌ కోసం నాలుగైదు రెడీ చేశారు అని కూడా అంటున్నారు. ఆ లెక్కన లుక్‌ టెస్టును లైవ్‌ మోడ్‌లోనే చేస్తున్నారు అని చెబుతున్నారు. డిఫరెంట్‌ లుక్స్‌లో మహేష్‌ను బయటకు తీసుకొస్తే ఫ్యాన్స్‌ రియాక్షన్‌ చూసి.. అందులో ఒకటి ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు అని చెబుతున్నారు. ఈ క్రమంలో మహేష్‌ లుక్‌ ఇదే అని బయటకు చెప్పి..

ఇంచుమించు బ్లఫ్‌ చేస్తున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే సాధారణమైన సినిమా చేస్తేనే రాజమౌళి తన హీరోల లుక్‌ ఆఖరి వరకు బయటకు ఇవ్వరు. అలాంటిది ఇప్పుడు మహేష్‌ సినిమాకు ఎందుకు బయట తిరగినిస్తారు అనే చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లాలో వచ్చిన వరదల కారణంగా జరిగిన నష్టానికి సాయంగా మహేష్‌.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలసి చెక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మహేష్‌ కొత్త లుక్‌ బయటకు వచ్చింది.

దేవరలో మ్యూజిక్ కు ప్రత్యేక స్థానం.. అనిరుధ్ చెప్పిన విషయాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus