Rajamouli: కన్నడ సినిమా పై స్పందించిన జక్కన్న తెలుగు సినిమా పై ఎందుకీ మౌనం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పక్కా హిట్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధిస్తే పెద్ద ఎత్తున సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విషయాన్ని అందుకుంది. కళ్యాణ్ రామ్ చాలాకాలం నుంచి ఎలాంటి హిట్ లేక సతమతమవుతున్న సమయంలో ఈయనకు బింబిసార సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంశలు కురిపించారు.

బాలకృష్ణ, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి ఎంతోమంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా చూసిన జక్కన్న మాత్రం ఈ సినిమాపై మౌనం వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా విజయం గురించి ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ రాజమౌళి ఈ సినిమా చూసిన ఈ సినిమా గురించి ఎలాంటి ట్వీట్ చేయకపోవడం గమనార్హం.

ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ నటించిన విక్రాంత్ రోణా సినిమా గురించి ఈయన ప్రస్తావిస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాంటి ఈయన తెలుగు సినిమాపై మౌనం వహించడం వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఈ సినిమా జక్కన్నకు నచ్చలేదా?నచ్చినా ఈ సినిమాపై స్పందించలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus