100 డేస్..200 సెంటర్స్ అనేవే నిజమైన విజయాలు

  • February 11, 2020 / 03:46 PM IST

ఒకప్పుడు సినిమా విజయానికి ఖచ్చితమైన ప్రామాణికం ఒకటి ఉండేది. వంద రోజులు, రెండొందల రోజు, ఏడాది ఇలా ఓ సినిమా ఆడిన రోజులు మరియు ప్రదర్శించిన సెంటర్స్ ఆధారంగా సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ సులువుగా తెలిసిపోయేది. టెలివిజన్ ప్రభావం కూడా జనాలపై తక్కువగా ఉన్న రోజులలో ప్రజలకు వినోద సాధనంగా ఒక్క సినిమా మాత్రమే ఉండేది. బాగా నచ్చిన సినిమాని ప్రేక్షకులు పదుల సంఖ్యలో పదే పదే చూశేవారు. దీనితో హిట్ మూవీస్ రోజుల తరబడి థియేటర్స్ లో కొనసాగుతూ ఉండేవి. ఆడినరోజులు, సెంటర్స్ ఆధారంగా ఒక సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో ఇట్టే తెలిసిపోయేది.

ఎంటర్టైన్మెంట్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. సినిమా విజయం రోజులలో కాకుండా కేవలం కలెక్షన్స్, ఓపెనింగ్స్ ఆధారంగా నిర్ణయించడం మొదలుపెట్టారు. పైరసీ కారణంగా విడుదలైన మొదటిరోజు సాయంత్రానికి సినిమా నెట్ లో ప్రత్యక్షం కావడం, డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ అందుబాటిలోకి రావడం వలన ఎంత పెద్ద సినిమా అయినా కేవలం రోజులలో మాత్రమే థియేటర్స్ లో ఉంటుంది. దీనితో విదులైన ఒకటి రెండు వారాలలో పెట్టుబడి రాబట్టుకోవాలి. అందుకే వందల థియేటర్స్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. దీనితో ఒక మూవీ విజయం ఓపెనింగ్స్ కలెక్షన్స్ మరియు మొదటివారం రన్ పై ఆధారపడి ఉంటుంది.

వసూళ్లు రాబట్టుకోవడానికి కొద్ది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నిర్మాతలు సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఫేక్ కలెక్షన్స్ సృష్టిస్తున్నారు. అసలు కలెక్టన్స్ కి ప్రచురిస్తున్న కలెక్షన్స్ కి పొంతన లేకుండా ఇష్టం వచ్చిన నంబర్లు వేసుకొని బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అంటూ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం అసలు కూడా రాలేదని ఓ ప్రక్క వాపోతున్నారు. ఈ పేక్ కలెక్టన్స్ సంప్రదాయం వలన హిట్ కి ప్లాప్ తేడా లేకుండా చేస్తుంది. అలాగే ప్రేక్షకులు కూడా వీటిని లైట్ తీసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. అందుకే ఆరోజుల్లో రోజులు, సెంటర్స్ ఆధారంగా విజయాలు సాధించిన చిత్రాలవే నిజమైన విజయాలు.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus