చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. కొత్త చిత్రాల విడుదల ఆగిపోవడం, షూటింగ్స్ నిలిచిపోవడం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం, పూర్వ వైభవం తేవడానికి కొందరు ప్రముఖులు కృషి చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, రాజమౌళి వంటి ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం జరిగింది. షూటింగ్స్ కి అనుమతి, టికెట్ ప్రైసింగ్, అభివృద్ధికి తోడ్పాటు వంటి అనేక విషయాలపై వీరు చర్చలు జరిపారు.
కాగా మరి టాలీవుడ్ ఇంత ఇబ్బందులలో ఉండగా హీరో కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నాడు అనేది పెద్ద ప్రశ్న. చిత్ర పరిశ్రమను సంక్షోభం నుండి బయటికి తేవాల్సిన తరుణంలో సామజిక వాదిని అని చెప్పుకొనే పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటీ? అనేది ఇక్కడి ప్రశ్న. రాజకీయ నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ సమస్యల గురించి ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేయరా? ఆ బాధ్యత ఆయనకు లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
అందరు హీరోల వలె కొంత ఆర్ధిక సాయం చేసి ఊరుకుంటే పవన్ బాధ్యత ముగిసినట్టేనా?. నాకు విషయ అవగాహన ఎక్కవ అని చెప్పుకొనే పవన్ కీలక సమావేశాలు హాజరుకాక పోవడం విడ్డూరం. రాజకీయాల నుండి కేవలం డబ్బుల కోసం, అవసరాల కోసం సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చానన్న పవన్ కళ్యాణ్ కి అది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అలా కాకుండా అవసరమైనప్పుడు వచ్చి నాలుగు సినిమాలు చేసి డబ్బు చేసుకొని వెళ్ళిపోతాను అంటే ప్రయోజనం ఏముంది.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!