అంత సిగ్గెందుకు పవన్..ఉన్న విషయం చెప్పొచ్చుగా…?

పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న ఒక్కొక ప్రాజెక్ట్ చిన్నగా సెట్స్ పైకి వెళుతున్నాయి. ఈనెల 20నుండి ఆయన పింక్ మూవీ తెలుగు రిమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సెట్లో ఆయన గెటప్ కి సంబంధించిన లుక్ బయటకి రావడంతో పాటు, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఏ ఎం రత్నం నిర్మాతగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించనున్న మరో చిత్రం ఈనెల 27నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. పవన్ ఈ చిత్రంలో ఓ బందిపోటుగా కనిపిస్తుండగా, మొఘలుల కాలం నాటి పీరియాడిక్ స్టోరీ అని వినికిడి. ఐతే పవన్ తన రీ ఎంట్రీని చెప్పుకోవడానికి, ప్రచారం కల్పించుకోవడానికి ఇష్ట పడటంలేదు. అసలు పింక్ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం గురించి కానీ, షూటింగ్ షెడ్యూల్ గురించి కానీ దర్శక నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

కానీ పింక్ మూవీ షూటింగ్ మాత్రం జరుగుతుంది. పవన్ తన మూవీకి సంబంధించిన అప్డేట్స్, ప్రకటనలు ఇవ్వొద్దని నిర్మాతలకు చెప్పారు. ఐతే సినిమా అనేది, ప్రొడక్ట్ కాదు చేసింది ఎవడో తెలియకపోవడానికి.. ఇది ఒక సర్వీస్.. విడుదల చేసి జనాల్లోకి తీసుకెళ్లి సొమ్ము చేసుకోవాలి. ఎప్పటికైనా అందరికీ తెలిసే విషయాన్ని పవన్ దాచాల్సిన అవసరం ఏమిటనేది అందరి ప్రశ్న. షూటింగ్ మొత్తం గుట్టుగా కానిచ్చినా, విడుదలకు ముందు భారీ ఎత్తున్న ప్రచారం చేయాలి, అప్పుడైనా పవన్ మూవీ విషయం తెలిసిపోతుంది. రాజకీయల్లో ఉంటూ.. సినిమా చేస్తున్నాను అని చెప్పుకోవడానికి పవన్ సిగ్గు పడుతున్నాడని అనిపిస్తుంది. గతంలో అలాగే ప్రస్తుతం అనేక మంది రాజకీయాలలో కొనసాగుతున్నా సినిమాలు చేస్తున్నారు. కానీ పవన్ ఇలా మౌనంగా సినిమాలు చేయడం, పరోక్షంగా ఆయనే జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నట్లు అవుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus