పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. భవిష్యత్తులో కూడా ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ల మధ్య కేవలం ఐదు రోజుల గ్యాప్ ఉండటంతో భీమ్లా నాయక్ ను వాయిదా వేయించాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఇప్పటికే మారింది.
నాగార్జున బంగార్రాజు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తానని చెబుతున్నా రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. రాజమౌళి పవన్ ను కలవాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సాధ్యం కాలేదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా పవన్, రాజమౌళి కలిసే అవకాశాలు దాదాపుగా లేవని సమాచారం. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారనుందని వార్తలు ప్రచారంలోకి రాగా మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్ విషయంలో మార్పు లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి రేసులో భీమ్లా నాయక్ ఉంటుందని మేకర్స్ చాలాసార్లు ప్రకటించిన తర్వాత రిలీజ్ డేట్ ను మార్చితే విమర్శలు తప్పవు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి నాలుగు పాటలు రిలీజ్ కాగా త్వరలో మరో పాట రిలీజ్ కానుంది. ఈ నెల 14వ తేదీన రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ కానుంది. భీమ్లా నాయక్ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ సినిమాల మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే భారీగా కలెక్షన్లు వస్తాయని భావించి పవన్ భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మార్పుకు ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!