Vijay: ‘బీస్ట్‌’లో విజయ్‌ అలా అనడానికి ‘అదిరింది’ సినిమానే కారణమా?

  • April 14, 2022 / 05:35 PM IST

సినిమాల్లో రాజకీయ ఆసక్తులు… కథను తద్వారా సినిమాను దెబ్బ కొడుతున్నాయని నిన్ననే మనం చెప్పుకున్నాం. ఈ కారణంగానే విజయ్‌ సినిమాలు రెండు, ఇప్పటివరకు ఇబ్బంది పడ్డాయని కూడా చెప్పుకున్నాం. అలా దెబ్బ తిన్నవి ‘సర్కార్‌’, ‘బీస్ట్‌’ అని కూడా చెప్పుకున్నాం. అయితే అసలు ‘బీస్ట్‌లో అంతలా రాజకీయ ఆసక్తులు ఏం ఉన్నాయి అనేది కూడా తెలియాలి కదా. అందుకే ఈ ప్రయత్నం. ఏప్రిల్‌ 13న విడుదలైన ‘బీస్ట్‌’ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.

Click Here To Watch NOW

విజయ్‌ సినిమాను ఫ్యాన్స్‌ ఆశించే చాలా అంశాలు అందులో లేవని చెబుతున్నారు పరిశీలకులు. అయితే ఇంకో సమస్య కూడా సినిమాను ఇబ్బంది పెట్టింది అని కూడా అంటున్నారు. అయితే విజయ్‌ పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌లు. దేశంలో ప్రముఖ రాజకీయ పార్టీని ఉద్దేశిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ విజయ్‌ ఈ సినిమాలోనూ వ్యాఖ్యలు చేశారట. దీని కోసం చెప్పే ముందు కాస్త వెనక్కి వెళ్దాం. విజయ్‌… రాజకీయాల్లోకి వస్తారా? లేదా? ఈ ప్రశ్న తమిళనాడులో చాలా రోజుల నుండి ఉంది.

అయితే దీనికి ఆయన నుండి ఎప్పుడూ సరైన సమాధానం రాలేదు. రావడం లేదు కూడా. అయితే తన సినిమాలు కొన్నింటిలో రాజకీయ డైలాగ్‌లు వినిపిస్తాయి. ఆ లెక్కన ఆ వ్యక్తిగత రాజకీయ పోరు ఏ పార్టీతో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ మధ్య ‘అదిరింది’ సినిమాలో జీఎస్టీ మీద సెటైర్లు ఉన్నాయి. అదంతా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ మీదనే అని కూడా అంటారు. ఆ సమయంలో తమిళనాడులోని ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.

ఆ సినిమా సమయంలో వచ్చిన ఇష్యూస్‌ కారణంగానో, లేక ఇంకొకటో తెలియదు కానీ.. మరోసారి విజయ్‌ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ‘బీస్ట్‌’ సినిమాలో ఈ మేరకు డైలాగ్‌లు ఉన్నాయి. సినిమా ప్రారంభంలో ‘మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి’ అని చెబుతారు. తీవ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరిపే సమయంలో ‘ఎన్నికలకు ముందు 200 మంది ప్రాణాలు పోతే… మీ ప్రభుత్వానికి ఓకేనా?’ అని ప్రభుత్వ ప్రతినిధితో తీవ్రవాది ఒకరు వ్యాఖ్యానిస్తాడు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు.

అయితే క్లైమాక్స్‌ సీన్స్‌లో విజయ్ డైలాగులు వింటే కేంద్రంం ప్రభుత్వంపై సెటైర్లు వేసినట్టు స్పష్టంగా అర్థమవుతందని పరిశీలకులు చెబుతున్నారు. భారత ప్రభుత్వ అధికారులకు చెప్పకుండా పాకిస్థాన్ భూభాగంలోకి హీరో వెళ్తాడు. అక్కడ ఒక తీవ్రవాద నాయకుడిని పట్టుకుని స్వదేశానికి బయలుదేరతాడు. అయితే ఆ సమయంలో పాకిస్థాన్ నుండి సైన్యం దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో హీరో భారత అధికారుల సాయం కోరాతాడు. అప్పుడు నువ్వు మాకు చెప్పకుండా వెళ్లినందుకు సాయం అందించే అవకాశాలు లేవని అధికారులు చెబుతారు.

అక్కడే హీరో ఓ డైలాగ్‌ అంటాడు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. ‘‘ఎన్నికలకు ముందు పాకిస్థాన్ నుండి తీవ్రవాద నాయకుడిని తీసుకొస్తే ఓట్లు పడతాయి. ఆ విషయం మీ పై వాళ్లకు తెలుసు’’ అని విజయ్‌ అంటాడు. దీని వల్ల ఎన్నికల్లో ప్రధాన మంత్రికి లబ్ధి చేకూరుతుందని యాడ్‌ చేస్తాడు. దీంతో వెంటనే అధికారులు హీరోకి మద్దతుగా ఫైటర్ జెట్స్ పంపమని ఆదేశిస్తారు. ఇదంతా ఇటీవల శత్రుదేశం మీద భారత్‌ చేసిన ఆకస్మిక దాడి గురించి వేసి సెటైర్‌ అని అంటున్నారు పరిశీలకులు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus