Prabhas: ‘యాత్ర 2’లో ప్రభాస్‌… ఎంతవరకు కరెక్ట్‌ అని భయపడుతున్న ఫ్యాన్స్‌!

‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌ వస్తుంది అని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్‌ చేసిన పోస్టర్‌తో త్వరలో షూటింగ్‌ ప్రారంభం అనే క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈ సారి సినిమా నిర్మాణంలో మరో నిర్మాణ సంస్థ కలిసి వస్తోంది అని కూడా తేలింది. అలా అనే కంటే ఓ స్టార్‌ హీరో కలసి వస్తున్నాడు అని తేలింది. ఆ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ కాగా, ఆ హీరో ప్రభాస్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ పరిస్థితుల్లో యూవీ క్రియేషన్స్‌ వాళ్ల మీద ‘వైసీపీ ముద్ర’ అవసరమా? అనే మాటలు వినిపిస్తున్నాయి.

నిజానికి ‘యాత్ర 2’ సినిమాలో యవీ క్రియేషన్స్‌ భాగమవుతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాళ్ల స్టైల్‌ తెలిసినవాళ్లు ఎవరూ ఈ మాటను నమ్మలేదు. ఎందుకంటే గతంలోనే ఈ ప్రొడక్షన్‌ హౌస్‌కి కొన్ని రాజకీయ బంధాలు ఉన్నప్పటికీ ఇలా డైరెక్ట్‌గా కలసి వస్తారు అని ఎవరూ అనుకోలేదు. అయితే నేరుగా యూవీ క్రియేషన్స్‌ సినిమాతో కలవకపోయినా వాళ్ల సెకండ్‌ బ్యానర్‌ అయిన వి సెల్యూలాయిడ్‌ ఈ సినిమాతో చేయి కలిపింది. ఈ లెక్కన ప్రభాస్‌ టీమ్‌ వచ్చినట్లే అనుకోవాలి.

దీంతో ఎన్నికల సీజన్‌లో ప్రభాస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ లేదంటే ప్రభాస్‌ ఫ్రెండ్స్‌ తప్పు చేస్తున్నారా? అనే ప్రశ్న మొదలైంది. పాన్‌ ఇండియా హీరోగా ప్రభాస్‌ దూసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా రాజకీయ కనెక్షన్‌ ఎంతవరకు కరెక్ట్‌ అనే చర్చ మొదలైంది. ‘యాత్ర’ సినిమా అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ‘యాత్ర 2’ పరిస్థితి వేరు. దీంతో 2024 ఎన్నికల తర్వాత ఏమవుతుందో, ఈ సినిమా పరిచయం ఎటు వెళ్తుందో అనే చర్చ మొదలైంది.

అయితే ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య వైసీపీ టికెట్ ఆశిస్తున్నారని ఓ టాక్ నడుస్తోంది. నరసాపురం నుండి ఆమె పోటీ చేయాలని అనుకుంటున్నారనేది ఆ టాక్‌ సారాంశం. ఈ నేపథ్యంలో ఏమైనా యూవీ టీమ్‌ జగన్‌ వైపు వచ్చిందా అనేది ఆలోచించాల్సిన అంశం. అయితే ఇప్పుడు యూవీ టీమ్‌ చేసిన పని మంచో చెడో కాలమే నిర్ణయించాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus