“పుష్ప 2” (Pushpa 2: The Rule) బెనిఫిట్ షోస్ లో జరిగిన రచ్చ అనంతరం అల్లు అర్జున్ (Allu Arjun) మళ్లీ ఒక పబ్లిక్ ఈవెంట్ లో కనిపించలేదు. కేసు కోర్టులో ఉండడంతో, మీడియాకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో “తండేల్” (Thandel) ఈవెంట్ కి బన్నీ ముఖ్య అతిథిగా వస్తున్నాడనే న్యూస్ నిన్నంతా హల్ చల్ చేసింది. అల్లు అర్జున్ అటెండ్ అయితే “తండేల్” సినిమాకి మంచి మైలేజ్ వస్తుంది అనుకున్నారు అందరూ. ఈవెంట్ కు కేవలం అతిథిలు, మీడియా మాత్రమే ఆహ్వానితులు అంటూ నిబంధలు సైతం విధించారు.
సాయంత్రం 6.30కి మొదలవ్వాల్సిన ఈవెంట్ 8 గంటలకి కానీ మొదలవ్వలేదు. కట్ చేస్తే.. అల్లు అర్జున్ ఈవెంట్ కు రావడం లేదని ఇన్ఫో లీక్ అయ్యింది. అయినా కూడా బన్నీ వస్తాడేమో అని అభిమానులందరూ దాదాపు 11 గంటల వరకు జరిగిన ఈవెంట్లో ఎదురుచూస్తూ వచ్చారు. కట్ చేస్తే.. చివర్లో అల్లు అరవింద్ (Allu Aravind) ఈ విషయమై క్లారిటీ ఇస్తూ.. “బన్నీ ఫారిన్ వెళ్ళొచ్చాడు. సివియర్ గ్యాస్ట్రైటిస్ కారణంగా రాలేకపోయాడు” అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ కి చాలామంది నీరుగారిపోయారు.
అసలు ఈవెంట్ ను 8 గంటలకి స్టార్ట్ చేయడం ఏంటి, 11 గంటల వరకు సాగదీయడం దేనికి, వస్తానన్న బన్నీ రాకపోవడానికి కారణం ఏంటి? అంటూ అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. బన్నీ రాక కోసం 8 గంటల వరకు వెయిట్ చేసారా? అని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా.. లక్కీగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రావడం..
“అర్జున్ రెడ్డి (Arjun Reddy)”లో హీరోయిన్ గా సాయిపల్లవిని (Sai Pallavi) తీసుకుందాం అనుకున్నాను అనడం మరియు తాను తెరకెక్కించిన “కబీర్ సింగ్, ఆనిమల్ (Animal)” సినిమాల్లో హీరోల కాస్ట్యూమ్స్ కు రిఫరెన్స్ గా నాగచైతన్యను (Naga Chaitanya) చూపించాను అని చెప్పడం వంటివి బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి తండేల్ రాజ్ కి పుష్పరాజ్ హ్యాండ్ ఇచ్చినా.. సందీప్ రెడ్డి వంగా సేవ్ చేశాడు.