Hero Ram: ‘వారియర్‌’ హక్కులు తెగ కొనేస్తున్న రామ్‌!

తమ సినిమాను తాము డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు హీరో సిద్ధపడుతున్నాడు అంటే.. ఆ సినిమా మీద నమ్మకం అయినా ఉండాలి. లేదంటే సినిమా మీద తేడా కొట్టి రైట్స్‌ కోసం ఎవరైనా ముందుకు రాకపోయి ఉండాలి. మరి ఈ రెండింటిలో ఏ కారణమో తెలియదు కానీ.. రామ్‌ అయితే తన రాబోయే సినిమా ‘వారియర్‌’ రైట్స్‌ను తన చేతుల్లో పెట్టుకుంటున్నాడు. అంటే ఆయా ప్రాంతాల్లో సినిమా హక్కుల్ని కొనుగోలు చేసేస్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర రైట్స్‌ కూడా తీసుకున్నాడని టాక్‌.

లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘వారియర్’ సినిమా మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు రామ్. తనకు ఎంతో ఇష్టమైన మాస్‌ అవతారంలో ఈ సినిమాతోనే కనిపించబోతున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సినిమా అని ప్రచార చిత్రాలు చూస్తేనే తెలిసిపోతుంది. ప్రచార చిత్రాల్లో కాస్త తమిళ వాసన కనిపిస్తున్నా… మాస్‌ సినిమా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సినిమాకు బజ్‌ కూడా బాగుంది. దీంతో రైట్స్‌ మీద కన్నేశాడట రామ్‌. ఈ క్రమంలో తొలిసారి తన సినిమా ఉత్తరాంధ్ర హక్కులు కొనేసి…

అన్నపూర్ణ ద్వారా పంపిణీ చేయిస్తున్నాడు. ఈ సినిమా ఆంధ్ర హక్కులను ₹17 కోట్ల రేషియోలో విక్రయించారట. అందులో వైజాగ్ ఏరియాను ₹4.32 కోట్లకు రామ్ తీసుకున్నాడట. ఇక నైజాం ప్రాంతం హక్కులను ₹13 కోట్ల మేరకు కోట్ చేశారట. దీనిపై బేరసారాలు సాగుతున్న టైమ్‌లో రామ్, స్రవంతి రవికిషోర్ కలసి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే డిస్ట్రిబ్యూషన్‌ను దిల్ రాజుకు ఇచ్చారు. మామూలుగా తెలుగు సినిమాకు విశాఖపట్నం, నైజాం ఏరియాలను కీలకంగా చూస్తూ ఉంటారు.

ఆ రెండు ప్రాంతాలు రామ్‌ నేరుగా కైవసం చేసుకోవడంతో సినిమా మీద భారీ నమ్మకం పెట్టుకున్నాడని అర్థమవుతోంది. అయితే సినిమా మీద నమ్మకం లేని సమయంలో సొంతంగా సినిమాలు రిలీజ్‌ చేసుకోవడంలో గతంలో చూశాం. మరిప్పుడు రామ్‌ది నమ్మకమా, లేక భయమా అనేది 14న సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus