Sidharth, Kiara: ఆలియా – సిద్‌ రిసెప్షన్‌లో ఆలియా వచ్చింది.. కానీ ఆయనెక్కడ?

బాలీవుడ్‌లో సినిమా తారల రిలేషన్‌ షిప్స్‌ కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ప్రేమ కానీ.. భలే గమ్మత్తుగా ప్రేమలో పడిపోతుంటారు. అంతే విచిత్రంగా విడిపోతుంటారు కూడా. అంతే కాదు మాజీ ప్రియుడు పెళ్లి మాజీ ప్రేయసి వెళ్తుంటుంది. మాజీ లవర్‌ పెళ్లికి వస్తుంటారు. తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ పెళ్లిలో ఇదే జరిగింది. దీంతో మళ్లీ బాలీవుడ్‌ లవ్‌ లైఫ్‌ చర్చలోకి వచ్చింది. ఆ పెళ్లి కియారా – సిద్ధార్థ్‌ది కాగా, ఆ వచ్చిన స్టార్‌ ఆలియా భట్‌.

బాలీవుడ్‌ స్టార్‌ నటులు కియరా అడ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ముంబయిలో సన్నిహితులు, స్నేహితుల కోసం పెద్ద రిసెప్షన్ నిర్వహించారు. దానికి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్‌కు బాలీవుడ్ కథానాయిక అలియా భట్ కూడా హాజరైంది. అయితే, ఆమె భర్త రణ్‌బీర్ కపూర్ మాత్రం రాలేదు. దీంతో ఏమైంది అంటూ ఆరాలు తీస్తున్నారు.

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘కపూర్ అండ్ సన్స్’ చిత్రాల్లో అలియా భట్‌, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకానొక సమయంలో వీరి పెళ్లి కూడా అవుతుందని చెప్పుకున్నారు. అయితే అదేమీ జరగలేదు. ఈలోపు ఆలియాకు రణ్‌బీర్‌కు రిలేషన్‌ ఏర్పడింది. సిద్ధార్థ్‌ కూడా కియారా అడ్వాణీతో ప్రేమలో పడ్డాడు. ఈ పెళ్లి జరుగుతుంది, రిసెప్షన్‌ ఉంటుంది అని

వార్తలు రాగానే ఈ ఈవెంట్‌కి ఆలియా వస్తుందా ? లేదా ? అనే చర్చ జరిగింది. అయితే చాలామంది అంచనాలను తలకిందులు చేస్తూ రిసెప్షన్‌కి ఆలియా వచ్చింది. అయితే రణ్‌బీర్‌ మాత్రం రాలేదు. దీంతో మాజీ లవర్‌ పెళ్లికి ఆలియా వెళ్లడం ఇష్టం లేకో, ఇంకెందుకో కానీ రణ్‌బీర్‌ రాలేదని చెబుతున్నారు. ఇలాంటి విషయాలపై క్లారిటీలు అడగం, ఇవ్వడం లాంటివి జరగవు. సో ఎప్పుడైనా రణ్‌బీర్‌ కలిస్తే మీడియా అడగాలి. ఇక్కడో విషయం ఉందండోయ్‌.. ఆలియా భట్‌తో వివాహం కాకపోయినా.. ఇంకో ఆలియానే పెళ్లి చేసుకున్నాడు సిద్ధార్థ్‌. ఎందుకంటే కియారా అసలు పేరు ఆలియా.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus