Bigg Boss 5 Telugu: సన్నీపై రవి గేమ్ ప్లాన్ అదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ గేమ్ ప్లాన్ అనేది బాగా వర్కౌట్ చేస్తున్నారు. ప్రతి టాస్క్ లో కూడా లాజిక్స్ వర్కౌట్ చేస్తూ ఎదుటివాళ్లని అందులో లాక్ చేసేలా గేమ్స్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా లాస్ట్ వీక్ ఛాన్స్ దొరికిందని సన్నీని టార్గెట్ చేశాడు హౌస్ మేట్స్ అందరూ. అంతేకాదు, ఎప్పట్నుంచో ఉన్న వాటిని సైతం బయటకి లాగి మరీ సన్నీని నిందించారు. ముఖ్యంగా సిరితో గొడవ అయిన తర్వాత సన్నీ బ్యాడ్ బిహోవియర్ అంటూ రవి వేసిన నిందని తీసుకోలేకపోయాడు సన్నీ. అంతేకాదు, రవి ఫేక్ అంటూ తిరిగి అతనికి ఫేక్ బోర్డ్ ని సైతం ఇచ్చాడు. అప్పట్నుంచీ ఇద్దరికీ కోల్డ్ వార్ నడుస్తోంది.

సంచాలక్ గా తను తీసుకున్న డెసీషన్ ని కూడా తప్పుపడ్డాడు సన్నీ. ఇద్దరి మధ్యలో కాసేపు ఆర్గ్యూమెంట్ కూడా అయ్యింది. ఈ సమయంలో టాస్క్ లో పవర్ యాక్సెస్ పొందిన రవి లోపలకి వెళ్లి బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేకమైన పవర్ టూల్ ని సన్నీకి ఇస్తానని చెప్పడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు సన్నీకి పవర్ టూల్ ఎందుకు ఇస్తానన్నాడు. ఆ పవర్ ఏంటో కూడా తెలియదు. అయినా కూడా ఇస్తానని ఎందుకు అన్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రవి ఏదో నెగిటివ్ పవర్ వస్తుందని కావాలనే సన్నీని ఎంచుకున్నాడు అంటూ సన్నీ ఫ్యాన్స్ గ్రూప్స్ లో పోస్ట్ లు పెడుతున్నారు. నిజానికి సన్నీ సంచాలక్ గా రవి తీసుకున్న డెసీషన్ కి హర్ట్ అయి గేమ్ ఆడను అని మొండిపట్టు పట్టి కూర్చున్నాడు.

పవర్ వచ్చిందని చెప్పినా కూడా నాకు అక్కర్లేదు అంటూ రిజక్ట్ చేశాడు. అయితే, రవి మాత్రం బయటకి వచ్చి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నీకు ఇచ్చాక అది నీదే అవుతుందని బిగ్ బాస్ ఆదేశం అని చెప్పాడు. దీంతో సన్నీ ఆడక తప్పలేదు. అయితే, రవి చేసిన పనికి పే బ్యాక్ గా ఇది ఇస్తున్నాను అంటూ సన్నీకి చెప్పి కన్విన్స్ చేయడం అనేది రవి గేమ్ ప్లాన్ లో భాగమా అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే, లాస్ట్ టైమ్ సంచాలక్ గా జెస్సీ ఇలాగే సన్నీ విషయంలో మానస్ విషయంలో ఆర్గ్యూమెంట్ చేశాడు. ఆ తర్వాత సంచాలక్ గా ఫెయిల్ అని తెలుసుకున్నారు.

దీంతో రవి కూడా సన్నీకి పవర్ టూల్ ఇచ్చి ఎంకరేజ్ చేశాడా..? లేదా ఏదైనా నెగిటివ్ పవర్ వచ్చినా తప్పులేదు అని అనుకున్నారా అనేది చూడాలి. ఇక వేరొకరిని తప్పించి మైన్ లోకి దిగి బంగారా బాల్స్ ని కలెక్ట్ చేయాలని ఆ పవర్ లో ఉండటంతో శ్రీరామ్ చంద్రని తప్పించి ఆ ప్లేస్ లో సన్నీ గేమ్ ఆడాడు. కలెక్ట్ చేసిన బంగారు బాల్స్ ని మానస్ కి ఇఛ్చాడు సన్నీ. దీంతో మానస్ హైఎస్ట్ లో ఉన్నాడు. అనీమాస్టర్ హైఎస్ట్ లో ఉంది. వీరిద్దరూ టాస్క్ ఆడాల్సి వచ్చింది. ఈ టాస్క్ లో అనీమాస్టర్ విన్నర్ గా నిలిచింది. ఇక బిగ్ బాస్ మరో ముగ్గురికి అవకాశం ఇవ్వడంతో మానస్ టాస్క్ లో గెలిచి ఆఖరి కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus