“సినిమాను థియేటర్లలో మాత్రమే చూసి ఆశీర్వదించండి. ప్రేక్షక దేవుళ్ళ వెర్డిక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, దయచేసి మా సినిమాను చూడండి, మాస్కులు పెట్టుకొని థియేటర్లకు రండి” అంటూ హీరోలు సినిమా రిలీజ్ టైంలో చేసే హడావుడి మాములుగా ఉండదు. పొలిటీషియన్ ఎలక్షన్స్ ముందు ఓటర్ ఇంటికి వెళ్లి చేసే హడావుడి కంటే.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ & సోషల్ మీడియాలో మన హీరోలు, దర్శకనిర్మాతలు, హీరోయిన్లు చేసే హడావుడి చాలా ఎక్కువ.
మరి అంత మర్యాదగా థియేటర్లకు ఆడియన్స్ ను పిలిచినప్పుడు.. థియేటర్ కి వచ్చిన జనాలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియక థియేటర్ల దగ్గర ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్న వారి గురించి కనీసం ఆలోచించాలి కదా. ముఖ్యంగా హీరో రవితేజ యాటిట్యూడ్ కు ఇండస్ట్రీ కూడా షాక్ అవుతోంది. ఇవాళ ఉదయం సినిమా రిలీజ్ అవుతుంది అని ట్వీట్ చేసిన రవితేజ.. కనీసం విడుదల పోస్ట్ పోన్ అవుతుంది అని కానీ, పోనీ ఎప్పుడు విడుదలవుతుంది అని కానీ కనీసం ఒక పోస్ట్ లేదు.
నిర్మాతల గురించి రవితేజ ఎప్పుడు ఆలోచించడు, తన రెమ్యునరేషన్ వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకుంటాడు. కనీసం తన అభిమానుల గురించైనా ఆలోచించాలిగా. అది కూడా లేకపోతే ఎలా?. దీన్ని బలుపు అనాలో లేక ఇంకేం అనాలో అర్ధం కావడం లేదు. సాయంత్రం 5.00 అవుతొంది ఇప్పటివరకు కనీసం ఎప్పుడు విడుదలవుతుంది? షో ఎప్పుడు? అనేది క్లారిటీ లేదు. ఇప్పటికైనా రవితేజ థియేటర్ల వద్ద వేచి చూస్తున్న తన వీరాభిమానుల కోసమైనా సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తే బెటర్.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!