బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం కెప్టెన్సీ టాస్క్ మంచి కిక్ ఇచ్చింది. ఇందులో రేవంత్ కి మెజారిటీ హౌస్ మేట్స్ సపోర్ట్ చేసి కెప్టెన్ ని చేశారు. అయితే, కొంతమంది మాత్రం రేవంత్ కి ఓటు వేయలేదు. ముఖ్యంగా శ్రీసత్య ఏదో సిల్లీ రీజన్ చెప్పి సపోర్ట్ చేయకుండా తప్పించుకుంది. అప్పుడే రేవంత్ కెప్టెన్సీని హ్యాండిల్ చేయలేవని, కోపం – యాంగర్ మేనేజ్మెంట్ అయ్యాక, అన్నీ తగ్గిన తర్వాత కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పింది.
తన ఫ్రెండ్ కెప్టెన్ అయ్యాక మారేకంటే, మారిన తర్వాత కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పి బాలాదిత్యకి సపోర్ట్ చేసింది. దీంతో రేవంత్ బాగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి అందరి కెప్టెన్సీలో నిద్రపోవడం, లేదా మైక్ మర్చిపోవడం ఇవన్నీ చేసిన రేవంత్ తన కెప్టెన్సీలో వేరేవాళ్లు అలా చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని ఉందని చెప్పి మెడలో హారం వేశాడు. దీని తర్వాత మెజారిటీ ఓట్లు తనకి వచ్చిన తర్వాత రేవంత్ ఎమోషనల్ అయిపోయాడు.
కెప్టెన్ గా ఫస్ట్ టైమ్ హౌస్ మద్దతు తనకి లభించడంతో ఏడుపు ఆపుకోలేకపోయాడు. అంతేకాదు, శ్రీసత్య నమ్మలేదు, వేరేవాళ్లు నమ్మారు అనేది కూడా రేవంత్ కి బాధని కలిగించింది. ఫస్ట్ నుంచీ తనకి ఫ్రెండ్ గా ఉన్న శ్రీసత్య కెప్టెన్సీ అప్పుడు సపోర్ట్ గా లేదని ఆ తర్వాత రేవంత్ అన్నాడు. కెప్టెన్సీ టాస్క్ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ హౌస్ లో మొదలైంది. ఈ టాస్క్ లోనే బాలాదిత్యకి బి.పి వచ్చింది.
లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా రింగ్ లో ఉన్న ఐటమ్స్ ని పోటీదారులు పుల్ చేస్తూ తీస్కుని ఫ్రిజ్ లో సరైన క్రమంలో అమర్చాలి. దీనికి రేవంత్ సంచాలక్ గా ఉన్నాడు. ఇక్కడే రేవంత్ జడ్జిమెంట్ ఇచ్చేటపుడు ఒకసారి ఆలోచించమని చెప్పారు హౌస్ మేట్స్. ఫ్రిజ్ ని త్వరగా మూసి, గెలిచిన వాళ్లు విజేతలు అవుతారు అని రాసి ఉంది. దీంతో బాలాదిత్య ఫ్రిజ్ ని త్వరగా మూసినవాళ్లు కాదు, ఫ్రిజ్ లో ఐటమ్స్ ఎక్కువ పెట్టిన వాళ్లు విన్నర్స్ అంటూ మాట్లాడాడు.
రేవంత్ కొద్దిగా కన్ఫూజ్ అయిపోయాడు. ఇక్కడే గీతు మద్యలో దూరి లాయర్ లాగా పాయింట్స్ మాట్లాడద్దు అన్నది. దీంతో బాలాదిత్యకి బిపి వచ్చింది. నా ఎడ్యుకేనన్ గురించి మాట్లాడకు, అసలు ఎందుకు మద్యలోకి వస్తున్నావ్ ? నేను చంటితో మాట్లాడుతున్నా నీతో కాదు అంటూ గట్టిగా అరిచాడు. అంతేకాదు, చంటి కూడా ఇక్కడ లాజిక్స్ మాట్లాడుూ రేవంత్ కి సలహాలు ఇచ్చాడు. రేవంత్ రెడీ రెడీ అంటే దేనికి రెడీ ఎవరు వెళ్లాలో క్లియర్ గా చెప్పాలి కదా, గో అని చెప్పాలి అంటూ మాట్లాడారు.
అలాగే రేవంత్ ఈ టాస్క్ లో సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడు. మొదట అందరూ గుమ్మిగూడి అరుస్తూ కన్ఫూజ్ చేశారు. ఆ తర్వాత బజర్ కి ఫ్రిజ్ లో ఐటమ్స్ ని చాలా వరకూ క్రమపద్దతిలో పెట్టలేకపోయారు. దీంతో ఫ్రిజ్ త్వరగా మూసిన అర్జున్ టీమ్ ని విన్నర్ గా ప్రకటించాడు రేవంత్. మొత్తానికి స్పాన్సర్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఫస్ట్ టైమ్ బాలాదిత్యకి కోపం తెప్పించింది. మరి దీనిపై వీకెండ్ నాగార్జున ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. అదీ మేటర్.