‘సలార్’ సినిమా వసూళ్లు ఎంత? ఈ ప్రశ్న గత నాలుగు రోజులుగా అభిమానులు ఒకరినొకరు అడుగుతూనే ఉన్నారు. టీమ్ ఏమైనా రాసిందేమో అని వాళ్ల సోషల్ మీడియాలో పేజీల్లోకి వెళ్లి చూస్తూనే ఉన్నారు. అక్కడ వారికి కనిపించే నెంబరు మూడు రోజులకు రూ. 400 కోట్లు అనే నెంబరే. దీంతో నిరాశతో ఆ పేజీ క్లోజ్ చేసేస్తున్నారు. మరికొందరు అయితే కాస్త దిగువకు వెళ్లి మిగిలిన పోస్టులు చూసి నిరాశతో క్లోజ్ చేస్తున్నారు. అర్థమైందిగా ఫ్యాన్స్ పరిస్థితి.
ఆ పరిస్థతే… ‘సలార్’ (Salaar) వసూళ్లు ఎందుకు చెప్పడం లేదు. పాన్ ఇండియా లెవల్‌లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందకుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ‘బాహుబలి 2’ రికార్డులు కూడా బద్దలు కొడుతుంది అని లెక్కలేశారు. అయితే ఇవన్నీ తొలి మూడు రోజుల వసూళ్లు చూసే. కానీ ఇప్పుడు వసూళ్ల లెక్కలు చెప్పకపోతుండటంతో ఏమైంది అనే ప్రశ్న మొదలైంది. సినిమా వసూళ్లు లేవా? లేక ఇంకేదైనా కారణమా అని అడుగుతున్నారు.
సినిమా రిలీజ్ వీకెండ్‌లో ఉన్నంత వసూళ్ల జోరు ఆ తర్వాత ఉండదు. అలా అని మిగిలిన రోజులు బిజీనా అంటే… లాంగ్ మంథ్ ఎండింగ్ పడింది. చాలా ఆఫీసులకు, స్కూళ్లకు క్రిస్మస్ తదితర కారణాల వల్ల సెలవులు వచ్చాయి. కాబట్టి వసూళ్లు బాగుండాలి. విదేశాల్లో కూడా వసూళ్లు భారీగానే రావాలి. అలా వచ్చి ఈ పాటికి ఏ వెయ్యి కోట్ల రూపాయల నెంబరో చెప్పుండాలి. కానీ అదేం జరగడం లేదు. సినిమా వచ్చి నేటికి వారం పూర్తవుతోంది కాబట్టి.
రేపు అంటే శుక్రవారం ఏమన్నా చెబుతారేమో చూడాలి. ఈ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చినన్ని వసూళ్లు ఇతర రాష్ట్రాల్లో రావడం లేదు అనే పుకారు మొదలైంది. హిందీ బెల్ట్‌లో ‘డంకీ’ జోరు కొనసాగుతోంది. తమిళంలో, కన్నడలో ఆశించిన నెంబర్లు లేవు అంటున్నారు. మరి ఈ పుకార్లు నిజమో కావో ఫైనల్ ఫస్ట్ వీక్ నెంబర్లు వస్తే గానీ తెలియదు.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!