Samantha: ట్రోలింగ్స్‌కి సమంత ఇప్పుడెందుకు రిప్లై ఇచ్చినట్లు!

ట్రోలింగ్స్‌కి సమంత చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. నిన్నటి నుండి ఈ విషయం గురించి చాలామంది వింటున్నారు, చదువుతున్నారు, రాస్తున్నారు, శభాష్‌ సమంత అంటున్నారు. ఇదంతా ఓకే.. ఆమె చాలా ధైర్యంగానే ట్వీట్‌ చేశారు. అయితే అందులో దేని గురించి, ఎవరి గురించి మాట్లాడుతోందో చెప్పలేదు అనేది పక్కనపెడదాం. అసలు సమంత ఇప్పుడెందుకు స్పందించింది. కుర్రాళ్లకు ఇప్పుడెందుకు క్లాస్‌ పీకింది. ‘నేను ఆ పని చేయలేదు, చేయించలేదు అని ఎందుకు చెప్పకనే చెప్పింది?’. ఈ ప్రశ్న చాలామంది మైండ్‌లను తొలిచేస్తోంది.

నాగచైతన్య – సమంత విడిపోయి ఎనిమిది నెలలు అవుతుంది. అసలు వాళ్ల విడాకులు పుకార్లు ఎలా వచ్చాయి. వచ్చాక వాటికి ఆమె సన్నిహితులు ఎలా రెస్పాండ్‌ అయ్యారు అనేది తర్వాత చూద్దాం. చైతన్య – సమంత విడాకులు అనౌన్స్‌ చేశాక సోషల్‌ మీడియా రెండుగా విడిపోయింది. కొంతమంది సమంతను సపోర్టు చేస్తే, మరికొంతమంది నాగచైతన్యను సపోర్ట్‌ చేశారు. మాటల యుద్ధం జరిగింది. అసలు ఏం జరిగిందో చై – సామ్‌ చెప్పకపోయినా నచ్చంది రాసుకున్నారు. దానికి ఏ రోజూ సమంత రిప్లై ఇవ్వలేదు.

మీరు మీ పని చూసుకోండి, మీ కుటుంబాన్ని చూసుకోండి అని అనలేదు. కానీ ఇప్పుడు? నాగచైతన్య నుండి సమంత ఇంత తీసుకుంది, అంత తీసుకుంది, పెళ్లి చీర వెనక్కి ఇచ్చేసింది… ఇలా ఒక్కటా రెండా చాలా రకాల రూమర్లు వచ్చాయి. వీటి విషయంలో సమంత సన్నిహితులు కొందరు కామెంట్స్‌ కూడా చేశారు. కానీ ఈ సమయంలో కూడా సమంత నుండి ఎలాంటి ట్వీట్‌ రాలేదు. మా అమ్మ చెప్పింది అంటూ కొన్ని సూక్తులు అయితే అన్యాపదేశంగా సోషల్‌ మీడియాలో రాసుకుంటూ వచ్చింది.

అవి చూసి ఇదంతా నాగచైతన్య గురించే అంటూ సమంత ఫ్యాన్స్‌, నెటిజన్లు ట్వీట్లు చేశారు. అప్పుడు ఇది నా మాటలు, నా ఇష్టం. మీరు ఎవరికో ఎందుకు ఆపాదిస్తున్నారు అని ట్వీట్ చేయలేదు. ‘పుష్ప’ సినిమాలో ‘ఉ అంటావా..’ పాట వచ్చినప్పుడు అందులోని సాహిత్యం ద్వారా సమంత మగవాళ్ల బుద్ధిని చెప్పింది అంటూ కామెంట్లు సోషల్‌ మీడియాలో కనిపించాయి. అప్పుడు కూడా సమంత ‘ఇది కేవలం పాట మాత్రమే’ అని ఎందుకు చెప్పలేదు.

ఇలా ఒకటా రెండా గత కొన్ని నెలలుగా సమంత చుట్టూ పెద్ద ట్రోలింగ్, కామెంట్స్‌ నడుస్తున్నాయి. అంతెందుకు ‘బంగార్రాజు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దక్షా నగార్కర్‌తో చైతన్య చిలిపి చేష్టలు అంటూ ఓ వీడియో బయటికొచ్చింది. దానిని చాలామంది సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చైతన్య ఇలా చేస్తాడా? అంటూ కామెంట్లు కూడా చేశారు. చైతన్య తన ఫ్యాన్స్‌తో అలా రాయించుకోడు కదా. అప్పుడు అవన్నీ రాయించింది ఎవరు? అనేది ప్రశ్న.

అప్పుడు కూడా ఈ విషయంలో సమంత మీద, ఆమె టీమ్‌ మీద పుకార్లు వచ్చాయి. అప్పుడు సైలంట్‌గా ఉంది సమంత. కానీ ఇప్పుడెందుకు సమంత స్పందించింది అనేదే ప్రశ్న. గుమ్మడి కాయల దొంగ సామెత గుర్తుకు చేసుకోవాలా? లేక ట్రోలింగ్‌ని కంట్రోల్‌ చేద్దామా అనేది ఆమెకే తెలియాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus