‘అ!’ సినిమాలో ఆకర్షించే అంశాలు

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘అ!’ సినిమా టైటిల్ ఆవిష్కరణ దగ్గర నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. నిత్యా మీనన్‌, కాజల్‌ అగర్వాల్, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నిన్న రిలీజ్ అయి అందరితో “అ!” అనిపిస్తోంది. “అ!” సినిమాలోని ఆకర్షించే అంశాలు….

1. అనుకొన్నది ఒకటి.. చేసింది మరొకటిఈ మూవీ స్టోరీ విన్న తర్వాత నిత్య మీనన్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడానికి ఒప్పుకున్నారు. అయితే ఇందులో రోల్ ని తాను ఎంచుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆమె కోసం రాసిన రోల్ ఫిక్స్ అని డైరక్టర్ ప్రశాంత్ చెప్పడంతో.. అతని నిర్ణయం ప్రకారమే నటించారు.

2. వాయిస్ ఓవర్ .. నిర్మాత చేపకి వాయిస్ ఓవర్ గురించి అడగడానికి నాని వద్దకు ప్రశాంత్ వెళ్లారు. అయితే కథ మొత్తం విన్న నాని సినిమాని తానే నిర్మిస్తానని ముందుకొచ్చారు.

3. రెస్పాన్స్ .. టైటిల్ స్టార్స్ కి ప్రశాంత్ కథని చెప్పిన తర్వాత అందరూ “అ!” అని ఫీలయ్యారు. సో సినిమా ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా ఇలాగే ఉంటుందని సినిమాకి అదే టైటిల్ ని పెట్టారు. ఇప్పుడు అందరి ఫీలింగ్ ఇదే.

4. నేచురల్ గా కాజల్ ప్రశాంత్ ఈ స్టోరీ ని మొదట కాజల్ కి వినిపించారు. ఆమె ఒప్పుకొని కేవలం ఐదు రోజుల డేట్స్ ఇచ్చారు. అనుకున్న సమయంలోనే షూటింగ్ పూర్తి చేశారు. ఇందుకోసం కాజల్ అసలు మేకప్ వేసుకోలేదు.

5. రెజీనా.. హుడీ రెజీనా తన క్యారక్టర్ కోసం ఒంటినిండా టాటూ వేసుకోవడమే కాదు హెయిర్ ని కూడా ట్రిమ్ చేసింది. అలాగే షూటింగ్ అయ్యేదాకా బయటికి వెళ్ళేటప్పుడు హుడీ తోనే కవర్ చేశారు.

6. ఒక్క పాటలో కథ

మనం బాగా గమనిస్తే “అ!” లో ఒకే ఒక సాంగ్ ఉంది. అది కూడా టైటిల్స్ పడే సమయంలో. మరో ఆసక్తికర సంగతి ఏమిటంటే ఆ థీమ్ సాంగ్ లోనే స్టోరీ మొత్తం చెప్పారు. సినిమాని బాగా గమనిస్తే ప్రతి ఫ్రేమ్ లోను ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్ కి కనెక్ట్ అయ్యి ఉంటది.

7. కథ వినకుండా ఓకే నాని నిర్మాత అని తెలిసిన వెంటనే, మురళి శర్మ స్టోరీ కూడా కంప్లీట్ గా వినకుండా ఈ సినిమాకి సైన్ చేశారు.

8. డైరక్టర్ సాహసంతొలి చిత్రానికి ఏ డైరక్టర్ చేయని సాహసాన్ని ప్రశాంత్ చేశారు. సినిమా వాళ్లు టచ్ చేయడానికి వెనుకాడే ఎన్నో అంశాలను ఇందులో చూపించారు. అంతేకాదు సినిమా చివరికి భగవద్గీత శ్లోకంతో ముగుస్తుంది.

ఇవి చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.. మరి ఇంకెందుకు ఆలస్యం సినిమాని చూసెయ్యండి. ఎంజాయ్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus