Bigg Boss 7 Telugu: కావాలనే శివాజీ మాస్టర్ ప్లాన్ వేశాడా ? ఈ సీజన్ లో జరిగిందేంటంటే.?

స్పా బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్. ఇది నాగార్జున కూడా హౌస్ మేట్స్ కి చెప్పిన పదం. ఇలాగే బయట ఫేమస్ అయ్యారు నేను చెప్పింది కాదు అని క్లియర్ గా చెప్పారు. అయితే, అసలు సీరియల్ బ్యాచ్ కి శివాజీకి ఏంటి ఈ గొడవ ? ఎందుకు శివాజీ అంతలా పగ పెంచుకున్నాడు ? ఇది ఒక్కసారి చూసినట్లయితే., శివాజీ బ్యాచ్ లోకి ప్రశాంత్ ఇంకా యావర్ వచ్చి ఎలా చేరారు అనేది అందరికీ తెలిసిందే. యావర్ – పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కూడా రాకముందు నుంచే శివాజీ సీరియల్ బ్యాచ్ ని టార్గెట్ చేసాడు.

ఫస్ట్ వీక్ శివాజీ స్మార్ట్ గేమ్ ఆడాడు. తను నామినేషన్స్ లోకి రాకుండా చూస్కున్నాడు. అలాగే, లవ్ – ఫర్గాట్ అనే గేమ్ లో ఎమ్మోజీల లని పల్లవి ప్రశాంత్ కి లవ్ ఇచ్చాడు. దీంతో ప్రశాంత్ బాగా కనెక్ట్ అయ్యాడు. అమర్ కి ఫర్గాట్ ఇచ్చాడు దీంతో ఎనిమీగా మారాడు. ఇదే వారం స్టార్ మా బ్యాచ్ అనే పదం వచ్చింది. వాళ్లంతా డీలక్స్ రూమ్ లో ఉన్నారా ? ఆ స్టార్ మా బ్యాచ్ అని అంటున్నాడని శివాజీ గురించి థామిని ప్రియాంక అండ బ్యాచ్ కి చెప్పింది. అప్పటికే పవర్ అస్త్రా టాస్క్ నడుస్తోంది.

ఆ తర్వాత ఇసుక టాస్క్ లో శివాజీకి ఎగైనిస్ట్ గా అమర్ ఇంకా గౌతమ్ ఇద్దరూ ఇసుక పోశారు. అక్కడ్నుంచీ ఈ పగ వెంటాడుతోంది. ఎందుకంటే., అక్కడ సందీప్ కి అలాగే ప్రియాంకకి సపోర్ట్ గా ఉన్నారు అందరూ. ఇది శివాజీకి నచ్చలేదు. వీళ్లు నలుగురు ముందుగానే మాట్లాడుకుని గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారని డిసైడ్ అయ్యాడు. ఇదే ఆడియన్స్ కి బలంగా చెప్పాలని అనుకున్నాడు. అదే చేశాడు. అలాగే, రెండో వారం పిట్ లో నామినేషన్స్ జరిగినపుడు శివాజీని టార్గెట్ చేశారు సీరియల్ బ్యాచ్. అక్కడ శివాజీ రెచ్చిపోయి మరీ నాట్యం చేశాడు.

అప్పుడు అమర్, ప్రియాంక ,శోభాశెట్టి , థామిని ఈనలుగురు ముఖ్యపాత్ర పోషించి మరీ శివాజీని నామినేట్ చేశారు. ఇక్కడ్నుంచీ ఇద్దరి మద్యలో వార్ అనేది బలంగా మారింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా శివాజీ వీళ్లనే టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆవారమే పల్లవి ప్రశాంత్ కూడా వీళ్లకి టార్గెట్ అయ్యాడు. అందుకే, శివాజీకి పల్లవి ప్రశాంత్ ని కూడా కలుపుకున్నాడు. ఇంట్లో ఉన్నవాళ్లకంటే కూడా స్మార్ట్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. ఇది అప్పటి పగ అన్నమాట.. అప్పట్నుంచీ ఇప్పటివరకూ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇన్ని వారాలుగా ఇదే సీరియల్ బ్యాచ్ అనే ముద్రని శివాజీ ఆయధంగా చేసుకుని వాడుకున్నాడు.

బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) టీమ్ కూడా వాళ్లకి సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని ఇండైరెక్ట్ గా ఆడియన్స్ కి చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. మరోవైపు స్టార్ మా బ్యాచ్ గేమ్ కూడా అలాగే ఆడారు. ఫౌల్ గేమ్స్ ఆడటం, అనవసరంగా కంటెంట్ కోసం సీన్ క్రియేట్ చేయడం, ఉన్నది లేనట్లుగా భావించి అరవడం, వాళ్లలో వాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతూ లేదని చెప్పడం ఇలా గేమ్ పరంగా కూడా వాళ్లకి పెద్ద మైనస్ అయ్యింది. శివాజీ ఆరోపణలు నిజం అయ్యాయి. ఇక్కడ శివాజీ కూడా యాక్టింగ్ తో, మాటలతో రెచ్చించాడు. ఇది తెలియని సీరియల్ బ్యాచ్ ట్రాప్ లో పడిపోయింది.

అప్పటికీ నాగార్జున వీకెండ్స్ పౌల్ గేమ్ అని చెప్తున్నా కూడా వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. ఇదే శివాజీ వేసిన మాస్టర్ ప్లాన్ అయ్యింది. ఏది ఏమైనా ఇప్పుడు సీజన్ చివర్లోకి వచ్చింది కాబట్టి విన్నర్ అవ్వాలంటే ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచాల్సింది. నిజానికి కార్తీకదీపం లాంటి ఫేమస్ ఫేమ్ తో వచ్చిన శోభా, మంచి సీరియల్ ఫేమ్ తో వచ్చిన ప్రియాంకలని దాటుకుంటూ అడ్రస్ కూడా తెలియని యావర్ ఓటింగ్ లో తన సత్తాని చూపిస్తున్నాడు. పల్లవి ప్రశాంత్, శివాజీ కూాడ తమ ఓట్ బ్యాంక్ ని కాపాడుకుంటున్నారనే చెప్పాలి. అదీ మేటర్.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus