‘బేబీ’ సినిమా టాలీవుడ్ కి సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్. దాని ద్వారా సాయి రాజేష్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయారు. తర్వాత అదే సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. హిందీ ‘బేబీ’ని అనౌన్స్ చేసి 2 ఏళ్ళు దాటింది. ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ తో ఈ రీమేక్ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత అతను తప్పుకోవడం జరిగింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘బేబీ’ రీమేక్ నుండి ఇప్పుడు అల్లు అరవింద్,ఎస్.కె.ఎన్ కూడా తప్పుకున్నట్టు స్పష్టమవుతుంది.
వాస్తవానికి ‘బేబీ’ సినిమాకి నిర్మాత ఎస్.కె.ఎన్. కానీ ఫైనాన్స్ చేసింది ‘గీతా ఆర్ట్స్’ సంస్థ. ‘బేబీ’ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ‘గీతా ఆర్ట్స్’ వద్ద తీసుకున్న అప్పుని వడ్డీతో సహా తీర్చేశారు సాయి రాజేష్, ఎస్.కె.ఎన్..లు..! ఓన్ రిలీజ్ చేసుకోవడం వల్ల ప్రాఫిట్స్ కూడా భారీగా వచ్చాయి. నేషనల్ అవార్డు సైతం వరించింది. దీంతో హిందీలో ఈ సినిమా రీమేక్ చేసేందుకు ఎస్.కె.ఎన్, గీతా ఆర్ట్స్ ఇంట్రెస్ట్ చూపించారు.
హిందీలో లవ్ స్టోరీస్ కి మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి.. అక్కడ బాగా ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అనేది వారి నమ్మకం. కానీ ఇంతలో ఏమైందో ఏమో హిందీ ‘బేబీ’ నుండి ఎస్.కె.ఎన్, గీతా ఆర్ట్స్ తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ‘మైత్రి మూవీ మేకర్స్’ ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సాయి రాజేష్ తాజాగా జరిగిన ‘డ్యూడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో రివీల్ చేశారు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.