Ramayana: బాలీవుడ్‌ ‘రామాయణం’… నో చెప్పిన మరో స్టార్‌ యాక్టర్‌ !

బాలీవుడ్‌లో చాలా ఏళ్ల నుండి ఓ సినిమా అనుకుంటున్నారు, అనుకుంటూనే ఉన్నారు. ఏమైందో ఏమో కానీ ఆ సినిమా ముందుకెళ్లడం లేదు. పేర్లు మారుతున్నాయి, కథల వరుస మారుతోంది, నటులు మారుతున్నారు.. కానీ ఆ ఆలోచన మాత్రం అలానే ఉండిపోయింది. ఆ సినిమా ఆలోచనే ‘రామాయణ్‌’. అవును రామాయణాన్ని భారతీయ భాషల్లో భారీ స్థాయిలో సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్స్‌ వేశారు. ఏదో ఒక అడ్డంకి ఆపేసింది. ఇప్పుడు మరోసారి ప్రయత్నాలు సాగుతుంటే నటులు వెనకడుగు వేస్తున్నారు.

బాలీవుడ్‌లో నితీశ్‌ తివారి దర్శకత్వంలో (Ramayana) ‘రామాయణం’ తెరకెక్కనుంది. నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీత పాత్రలో ఆలియా భట్‌ను ఎంపిక చేశారని గత కొన్ని నెలలుగా బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరి లుక్ టెస్ట్‌ కూడా అయిపోయిందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ఆలియా తప్పుకుంది అని అంటున్నారు. ఇతర సినిమాల బిజీ వల్ల ఈ సినిమాకు డేట్స్‌ కేటాయించలేక తప్పుకుంటోందని అని చెబుతున్నారు.

ప్రస్తుతం అలియా హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఆ సినిమాలకు ఎక్కువ డేట్స్‌ ఇవ్వడం అలాగే గతంలో బాలీవుడ్‌లో ఒప్పుకున్న సినిమాలు లాంటి కారణంతో ఇప్పుడు ‘రామాయణం’ నుండి తప్పుకుంది అంటున్నారు. ఇంతకుమందు ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర కోసం అనుకున్న యశ్‌కు కూడా లుక్‌ టెస్ట్‌ చేశారు. అంతా బానే ఉన్నా యశ్‌ ఇంకా ఈ సినిమాకు ఓకే చెప్పలేదట. అయితే వీళ్లంతా తప్పుకోవడానికి, లేదంటే ఇంకా నిర్ణయం చెప్పకపోవడానికి కారణం డేట్స్‌ మాత్రమే కాదు అంటున్నారు.

పురాణాలు, దేవుళ్ల నేపథ్యంలో సినిమా అంటే ఒకప్పుడు ముందుకు వచ్చేవారు. అయితే ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ తర్వాత ఆలోచనలు మారిపోతున్నాయి. ఆ సినిమా ఫలితం, రిసెప్షన్‌ కారణంగా ఎవరైనా ముందుకు వచ్చేవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. సరైన విధానంలో సినిమా రాకపోతే ట్రోలింగ్‌ బారిన పడతాం అనే భయం కూడా తప్పుకోవడానికి ఓ కారణం అని చెబుతున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus