Suma Kanakala: మరో ‘అలీ’ అనిపించుకుంటుందా?

టీవీల్లో, ఆడియో/ప్రీ రిలీజ్‌ ఈవెంట్ల హోస్టింగ్‌లో సుమను దాటేవారే కాదు, ఆమెను ఈక్వెల్‌ చేసేవాళ్లు కూడా లేరు అనడం అతిశయోక్తి లేదు. అంతగా స్పాంటేనిటీ, లాంగ్వేజ్‌తో దూసుకుపోతుంటుంది. అందుకే చాలా ఏళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఏ టీవీ ఛానల్‌ చూసినా ఏదో ఒక షో చేస్తుంటారు. దీనికితోడు యూట్యూబ్‌ ఛానల్‌ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సుమ మాటలు… షోకి వచ్చే కంటెస్టెంట్లు నొచ్చుకునేలా చేస్తున్నాయా? చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

ముందుగా మనం చెప్పుకున్నట్లు సుమకు స్పాంటేనిటీ ఎక్కువ, ఎదుటివాళ్ల డైలాగ్‌ పూర్తవ్వడం ఆలస్యం కౌంటర్‌తో రెడీ అయిపోతుంది. అయితే ఈ క్రమంలో కొంచెం ఇబ్బందికరమైన పదాలు, మాటలు ఆమె నోటి నుండి వచ్చేస్తుంటాయి. ఎవరో కుర్ర యాంకర్‌ అలా అనేస్తే ఓకే కానీ, సీనియర్‌ మోస్ట్‌ యాంకర్‌ అయిన సుమ అలా అనడం కొంతమందికి నచ్చడం లేదు. ఇంకొందరైతే మరో ‘అలీ’లా తయారవుతారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని వారాలు క్యాష్‌ ప్రోగ్రామ్‌ చూస్తుంటే సుమ ‘అతి’ డైలాగ్‌లు వచ్చేస్తున్నాయి. అయితే మీర అలీ అంత అసభ్యంగా ఉండకపోయినా… ఆమె అలాంటి మాటలు అనకపోతే బాగుండు అనేలా ఉంటున్నాయి. ప్యాంట్‌ వేసుకోకపోవడం గురించి ఆమె మాట్లాడటం అంతగా బాగుండదు అని నెటిజన్ల అభిప్రాయం. ఈ వారం ఎపిసోడ్‌లో ఈ డైలాగ్‌ ఉంది. గతవారం అయిన సీరియల్ యాక్టర్స్‌ ఎపిసోడ్‌లోనూ ఇలాంటివి కొన్ని డైలాగ్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో సుమ మరోసారి తన మాటల్ని చెక్‌ చేసుకుంటే బాగుంటుందనేది ఆమె అభిమానుల సూచన.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus