Sundeep Kishan: ‘వివాహ భోజనంబు’ గురించి సందీప్‌ ఆలోచనేంటో?

ఒకప్పుడు హిట్‌ అవుతుందనుకున్న సినిమానో, హిట్‌ అయిన సినిమాను రీమేక్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మెగా ఫ్యామిలీ రీమేక్‌ల జోరు పెంచాక… లెక్క భారీగా మారింది. పర భాషా చిత్రం తెలుగులో డబ్బింగ్‌ అయ్యి… చాలామంది చూసేసినా… మెగా హీరోలు ఆ సినిమా చేస్తుంటారు. ఇప్పుడు సందీప్‌ కిషన్‌ కూడా ఇలాంటి పనే చేయబోతున్నాడు. అయితే ఇక్కడ కాదు, తమిళంలో. కమెడియన్‌ సత్య ప్రధాన పాత్రలో ‘వివాహ భోజనంబు’ అనే సినిమాకు సందీప్‌ కిషన్‌ సహ నిర్మాతగా వ్యవహరించా

ఆ సినిమాలో నటించారు. ఓటీటీలో విడులైన ఈ సినిమా ఆకట్టుకుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా వహించే ఓ వ్యక్తి… లాక్‌డౌన్‌ టైమ్‌లో పెళ్లి చేసుకుంటే ఏమైంది అనేది ఆ సినిమా. ఓటీటీల్లో మన జనాలు చూసి చక్కగా నవ్వుకున్నారు కూడా. అంతే కాదు ఆ సినిమాకు తమిళ వెర్షన్‌ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు సందీప్‌ కిషన్‌ ఆ సినిమా తమిళ హక్కుల్ని అమ్మేశారు అనే వార్త వినిపిస్తుంది. చిన్న హీరోతో ఆ సినిమా తీయడానికి జ్ఞానవేళ్‌ రాజా ఆ కథ హక్కులు కొనుక్కున్నారట.

తమిళ వెర్షన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ… మళ్లీ ఎందుకు రీమేక్‌ చేస్తారు అనేది అర్థం కాని విషయం. ఆ సినిమా కథ ఇప్పటికే పాతబడిపోయింది. ఇప్పుడు తమిళంలో తీస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus