Kanguva: కనీసం ఇప్పటికైనా ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండయ్యా!

భారీ అంచనాలు, ఎన్నో ఆశలు నడుమ విడుదలైన “కంగువ”(Kanguva)కి మిశ్రమ స్పందన లభించిన విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి భారీ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా సూర్య(Suriya)  ఫ్రాన్సిస్ క్యారెక్టర్ పోర్షన్ మరీ ఎక్కువగా ట్రోల్ అవుతోంది. సినిమా రిజల్ట్ చూసిన తర్వాత కూడా నిర్మాత జ్ఞానవేల్ (K. E. Gnanavel Raja)  ఇప్పటికీ ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్ట్ చేస్తుంది అని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడనుకోండి. అయితే.. సినిమాలో బోలెడన్ని నెగిటివ్ లు ఉన్నప్పటికీ,అత్యంత పెద్ద నెగిటివ్ సినిమా సౌండ్.

Kanguva

వేల మంది ఆడియన్స్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా సినిమాలో సౌండ్ కాస్త తగ్గించండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు. ఇదే విషయమై స్పందించిన జ్ఞానవేల్ రాజా మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మాకు కూడా సౌండ్ గురించి ఫీడ్ బ్యాక్ వచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబిటర్స్ కి సౌండ్ 2 యూనిట్స్ తగ్గించమని చెప్పాము” అని క్లారిటీ ఇచ్చారు.

కానీ.. ఇప్పటివరకు ఈ సౌండ్ విషయంలో ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. జనాలు ఇప్పటికీ హాహాకారాలు పెడుతూనే ఉన్నారు. మరి జ్ఞానవేల్ రాజా & టీమ్ ఈ సౌండ్ విషయాన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకోవడం లేదు అనేది అర్థం కాని విషయం. ఇకపోతే.. “కంగువ” సినిమా కలెక్షన్స్ విషయంలో చిత్ర బృందం అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ లో కూడా చాలా తేడా ఉందని ట్రేడ్ వర్గాలు బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు.

సినిమా రిజల్ట్ ఏమిటి అనేది ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 5న “పుష్ప 2” (Pushpa2)  విడుదలవుతుంది కాబట్టి, సినిమాకి మహా అయితే 20 రోజుల రన్ మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఈ 20 రోజుల్లో “కంగువ” నిర్మాత జ్ఞానవేల్ రాజా ఊహించినట్లు 1000+ కోట్ల కలెక్షన్ సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus