టాలీవుడ్‌లో మోస్ట్ ప్లానింగ్, మోస్ట్ థింకింగ్ ప్రొడక్షన్ రాస్తే అందులో పై వరుసలో వచ్చే పేర్లలో ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు ఒకటి. అయితే ఇదంతా గతం… ఇప్పుడు వాళ్లకు ఏదీ కలసి రావడం లేదు. కొన్ని సినిమాలు పట్టాలెక్కడం కూడా కష్టమవుతోంది. అలా అన్ని సినిమాలకు కాదు కానీ.. కొన్ని సినిమాలకు మాత్రం చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇదేదో ఎవరో చెప్పింది కాదు ఓ హీరో సినిమాలు, వాటి ఫలితాలు చూస్తే మీకు అర్థమైపోతుంది.
ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అయితే, ఆ హీరో విజయ్ దేవరకొండ. అవును వీళ్ల కాంబినేషన్‌లో మూడు సినిమాలు ఓకే అయ్యాయి. అందులో ఒకటి షూటింగ్ పూర్తవ్వకుండానే ఆగిపోతే… ఇంకో రెండు పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. అయితే అందులో ఒకటి డిజాస్టర్‌గా మిగిలితే, ఇంకొకటి హిట్ అనిపించుకుని ఆ తర్వాత వసూళ్లు రాక కుదేలైపోయింది. దీంతో (Vijay Devarakonda) విజయ్‌కి, మైత్రీ వాళ్లకు ఎందుకు కుదరడం లేదు అనే ప్రశ్న మొదలైంది.
చిరంజీవి, బాలకృష్ణ. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, లాంటి స్టార్ హీరోలకు రికార్డు బ్రేకింగ్ సినిమాలు ఇచ్చిన సంస్థ అది. కుర్ర హీరోలకు కూడా ఓ రేంజ్ హిట్లు అందిస్తోంది. కానీ విజయ్ దగ్గరకు వచ్చేసరికి బ్లాక్‌బస్టర్ బస్టర్ సంగతి పక్కనపెడితే సరైన విజయమే దక్కడం లేదు. తొలుత వీరి కాంబినేషన్‌లో ‘హీరో’ అనే సినిమా ప్రారంభమైంది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చేశారు. బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది. గ్యాప్ ఇచ్చి ‘ఖుషి’ చేస్తే టీమ్‌ను ఖుషీ చేయలేకపోయింది.
నిజానికి ఖుషి సినిమాకు ఓవర్సీస్‌లో, నైజాం ఏరియాలో మంచి వసూళ్లే వచ్చాయి. కానీ మిగిలిన ప్రాంతాల్లో వసూళ్ల లెక్క ఇబ్బందిపెడుతోంది. దీంతో హిట్ సినిమా కాస్త అటు ఇటు సినిమా అయిపోయింది. దీంతోనే విజయ్‌కి, మైత్రికి ఏమైంది అనే ప్రశ్న ఉదయించింది. చూద్దాం నెక్స్ట్ మూవీ చేస్తే అందులో అయినా విజయం సాధిస్తారేమో.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!